కృష్ణ

బాధగా ఉన్నా... అధిష్టానం ఆదేశాలే శిరోధార్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: నా రాజకీయ దైవం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన దయతోనే తాను ఇంత వాడినయ్యా, పెడన ప్రజల చలవతోనే అసెంబ్లీలో అడుగు పెట్టా, జగన్ సూచన మేరకే మైలవరం వచ్చా, ఓడినా మడమ తిప్పకుండా పని చేసి నియోజకవర్గాన్ని వైసీపీ కంచుకోటగా తీర్చిదిద్దా, రాబోయే ఎన్నికలలో తిరుగులేని మెజారిటీతో మంత్రి దేవినేని ఉమను ఓడిద్దామనుకున్నా, కానీ పరిస్థితులు తారుమారయ్యాయి, జగనన్న ఆదేశాల మేరకు మళ్ళీ పెడన వెళ్తున్నా, నియోజకవర్గాన్ని, ఇక్కడి ప్రజలు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలను చూస్తుంటే జన్మధన్యమై పోయింది, నియోజకవర్గాన్ని వదలి వెళ్ళటానికి బాధగా ఉంది, కానీ బాస్(జగన్) ఆదేశాలే శిరోధార్యంగా భావించి బరువెక్కిన హృదయంతో వెళ్తున్నా ఇప్పటి వరకూ తనకు సహకరించిన అందరికీ పేరుపేరునా పాదాభివందనం చేస్తున్నానంటూ నిన్నటివరకూ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. గురువారం ఇక్కడ జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో జోగి రమేష్ ప్రసంగం అందరిలో ఆసక్తిని రేపింది. రమేష్ తన రాజకీయ చరిత్ర చెబుతూ నియోజకవర్గాన్ని విడిచి వెళ్తున్నానని చెబుతున్నప్పుడు ఉద్యేగంతో నోట మాట రాలేదు. ఈనియోజకవర్గ తననెంతో ఆదరించిందని, గత ఎన్నికలలో కొంతమంది వెన్నుపోటు రాజకీయం చేసిన కారణంగానే తాను ఓడిపోయానన్నారు. ఐనప్పటికీ నిరుత్సాహపడలేదని, కార్యకర్తలే కొండంత అండగా ఉన్నారని, జగన్ ప్రోత్సాహం తనను నడిపించిందని, బిసి కులానికి చెందిన తనను ఆనాడు వైఎస్ ఆదరించారని, నేడు జగన్ గుర్తించారని వారి అండదండలు, కార్యకర్తల ఆశీస్సులున్నంత వరకూ తాను ప్రజాసేవకే అంకితమై పని చేస్తానని చెప్పారు. తాను పెడన వెళ్ళినప్పటికీ ఇక్కడి కార్యకర్తలతో తన అనుబంధం విడిపోదన్నారు. జోగి రమేష్ మాట్లాడుతున్నంత సేపూ కార్యకర్తలు బరువెక్కిన హృదయాలతో, బాధాతప్త మనసుతో అసక్తితో ఆయన ప్రసంగాన్ని విన్నారు. అనంతరం ఆయను కలిసి అభినందించటానికి కార్యకర్తలు పోటీలు పడ్డారు. జోగి మాట్లాడుతూ ఇప్పటి వరకూ తనను ఆదరించినట్లుగానే కెపిని కూడా ఆదరించాలని సూచిస్తూ కెపిని కార్యకర్తలకు పరిచయం చేస్తూ ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేదికపై నిలుచుని ఇరువురినీ చెరోవైపు పెట్టుకుని అప్పగింతల కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ముగ్గురికి కార్యకర్తలు పెద్దఎత్తున సన్మానం చేశారు.