కృష్ణ

‘సోషల్ మీడియా’పై నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: వివాదాస్పద అంశాలకు వేదికగా మారుతున్న సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాం గం దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో నిరాధారమైన అంశాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గత వారం పది రోజులుగా పార్ధి గ్యాంగ్ జిల్లాలోకి చొరబడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈ ప్రచారానికి ప్రజలంతా భయాందోళనలకు గురై పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన అమాయకులపై భౌతికదాడులకు దిగుతున్నారు. పోలీసు శాఖ ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా గ్రామాల్లో పరిస్థితి ఆశించిన మేర అదుపులోకి రాలేదు. దీంతో అసలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సోషల్ మీడియాపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. వివాదాస్పద పోస్టులు పెట్టే వారి ఆట కట్టించేందుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నడుం బిగించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోషల్ మీడియా సెల్ ద్వారా వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని ప్రారంభించారు. ఈ సోషల్ మీడియా సెల్ ద్వారా సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్స్‌టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌పై 24గంటలూ నిఘా పెడుతున్నారు. అసాంఘిక, మత, రాజకీయపరమైన, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సమాచారాన్ని పెట్టిన వారిపై సత్వర చర్యలు తీసుకుంటూ అటువంటి వాటిని సామాజిక మాధ్యమాల నుండి అసంబంధిత ఖాతాలను తొలగించి శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత సోషల్ మీడియా సెల్ స్వీకరించింది. నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో సామాజిక మాధ్యమాలు రోజు వారి దిన చర్యగా మారింది. 24గంటల సమయంలో 10 నుండి 12గంటలు సోషల్ మీడియాలోనే గడుపుతున్నారంటే దాని ప్రభావం ప్రజలపై ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రజలను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేసిన పార్ధి గ్యాంగ్ సమాచారాన్ని పోస్టు చేసిన వారి ఫేస్‌బుక్, వాట్సాప్ ఎకౌంట్లను గుర్తించే పనిలో సోషల్ మీడియా సెల్ పడింది.
సోషల్ మీడియాను ఉపయుక్తంగా వాడుకోవాలి
సోషల్ మీడియాను ఉపయుక్తంగా వాడుకోవల్సిన అవసరం ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేర్కొన్నారు. ఉపయుక్తమైన సమాచారాన్ని పోస్టు చేసిన వారిని పోలీసు శాఖ అభినందిస్తుందన్నారు. అసాంఘిక, అనాలోచిత సమాచారాన్ని పంపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నయవంచకుడు నారా!

*మాజీ మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం

మైలవరం, మే 24: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఒక నయవంచకుడని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మైలవరం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశం గురువారం స్థానిక రెడ్‌గ్రౌండ్‌లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం చంద్రబాబు ఎటువంటి మోసాలకైనా వెనుకాడడని విమర్శించారు. మొన్నటి వరకూ ప్రధాని మోదీతో జతకలిపి ఆయనను ఆకాశానికెత్తేసిన చంద్రబాబు నిన్న కర్నాటకలో రాహుల్‌తో దోస్తి చేస్తున్నాడని దుయ్యబట్టారు. అవకాశవాదానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబేనన్నారు. బాబు నయవంచకుడని స్వయాన ఆయన మామ ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేశారు. జగన్ పాదయాత్రతో బాబు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన బాబు జగన్‌పై ఆరోపణలు చేయటం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్‌కు అన్యాయం చేసినందునే జగన్ పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. తమ పార్టీ బిసిలకు అన్యాయం చేసిందని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. వైఎస్ హయాంలో పార్థసారధికి మంత్రి పదవి ఇచ్చి కట్టబెట్టిన ఘనత తమదేనని చెప్పారు. బిసి నాయకుడు జోగికి జగన్ అన్యాయం చేయబోరని, పెడనలో గెలిపించి తీసుకొస్తామని చెప్పారు. సభలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సూన్యమన్నారు. ఎందరో మహనీయులు ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని కానీ దేవినేని ఉమ మాత్రం ఏం చేశాడో బహిరంగ వేదికపై చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ ఓటమే ధ్యేయంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ తనను ఆదరించిన మాదిరిగానే వసంత కృష్ణ ప్రసాద్‌ను ఆదరించాలన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకే తాను పెడన వెళ్ళానని, తర్వాత 2014లో జగన్ ఆదేశాల మేరకు మైలవరంలో పోటీ చేశానని, తాజాగా జగన్ ఆదేశాల మేరకు మళ్లీ పెడన వెళ్తున్నానని, పార్టీ ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు. కార్యకర్తలు నిరుత్సాహపడకుండా కెపిని గెలిపించాలని తమలాంటి వారు గెలిస్తేనే జగన్ సీఎం అవుతారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గంలో వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువని ప్రస్తుత ఇన్‌చార్జ్ కెపి వీటిని గుర్తించి నడవాలని సూచించారు. తాను పెడన వెళ్ళినా తన ఆత్మ మైలవరంలోనే ఉంటుందని ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉండి వారికి సాయపడతానని చెప్పారు. ఇప్పటి వరకూ తన వెన్నంటి నడిచిన వారంతా కృష్ణ ప్రసాద్ వెంట నడవాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డబ్బిచ్చి తాను నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించానని చెబుతున్న మంత్రి దేవినేని ఉమ తాను ఎంత డబ్బిచ్చి మైలవరం వచ్చాడో చెప్పాలన్నారు. తాను ఇక్కడికి వస్తున్న విషయం తెలుసుకుని భయపడి తనను గుంటూరులో టీడీపీ తరపున పోటీ చేయించేందుకు మంత్రి పత్తిపాటితో మంతనాలు చేయించాడని కేపీ ఆరోపించారు. ఉమావన్నీ వెకిలి చేష్టలన్నారు. అందరినీ కలుపుకు పోతాననని ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తాను ఆదుకునేందుకు ముందుంటానని చెప్పారు. జోగి రమేష్‌కు తనకు ఎటువంటి విబేధాలు లేవని, పార్టీ ఆదేశాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. ఉమను సాగనంపటానికే మూడో కృష్ణుడిగా తనను జగన్ పంపాడన్నారు. తాను స్వతహాగా రైతుబిడ్డనేనని, రైతుల బాధలు తనకు తెలుసునని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పాత పధకాలకు కొత్త పేర్లు పెట్టటం తప్ప ఉమ చేసిన అభివృద్ధి సూన్యమన్నారు. కార్యక్రమంలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, నందిగామ పార్టీ ఇన్‌చార్జ్ మొండితోక జగన్‌మోహనరావు, పార్టీ నేతలు అప్పిడి సత్యనారాయణరెడ్డి, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, బొమ్మసాని చలపతి, పజ్జూరు తిరుపతిరావు, వేములకొండ తిరుపతిరావు పామర్తి శ్రీనివాసరావు, పామర్తి వెంకట నారాయణ, మందా జక్రధరరావు, జొన్నలగడ్డ గంగాధరరావు, కాజా రాజ్‌కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.