కృష్ణ

సాధారణ కాన్పులకూ ఆ‘పరేషాన్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: సాధారణ కాన్పులకు కూడా సిజేరియన్ చేస్తూ కొన్ని ఆసుపత్రులు వేలకు వేలు దోచేస్తున్నాయి. గ్రామాల్లోని అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఆసుపత్రులు రకరకాలుగా భయభ్రాంతులకు గురిచేస్తున్నాయ. వైద్యో నారాయణో హరి.. నానుడికి వక్రభాష్యం చెబుతూ సంపాదనే ధ్యేయంగా ప్రజలెలాపోతే మనకెందుకు ‘మన కోటు జేబు నిండితే’ చాలన్నట్టు ఎడాపెడా ఆపరేషన్లు చేసిపారేస్తు న్నారు. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చేవారికి ‘సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవానికే ప్రయత్నిద్దాం’ అని నమ్మబలికి ఆనక ‘చేయదాటి పోయందని’, ‘మరికొద్దిసేపు వేచిచూస్తే పెద్ద ప్రాణానికే ముప్పు’ అని గర్భిణి బంధువులను ‘మానసికంగా’ ‘సిద్ధం’ చేస్తారు. సదరు వైద్యుడు ‘మన మంచికే చెబుతున్నాడని’ వారిని ‘మానసికంగా సిద్ధం’ చేస్తూనే ‘సొమ్ము సిద్ధం చేసుకోవాలని’ ‘ఇండికేషన్’ ఇస్తారు. ‘పిల్లను మీ చేతుల్లో పెట్టామని’ ఆయా బంధుగణంతో చెప్పించుకున్నాక ‘అసలు తంతు’ ప్రారంభిస్తారు. ‘ఉమ్మనీరు తగ్గి పోయందని, బిడ్డలో కదలిక తగ్గుతోం దని’ చెప్పి ‘పని కానిచ్చేస్తారు’ (అదే ఆపరేషన్). దీనివల్ల సదరు గర్భిణి మళ్లీమళ్లీ కాన్పులకు పనికిరాకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతు న్నారు. మహిళలు గర్భం దాల్చినప్పుడే సాధారణంగా ప్రతినెలా క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. తొమ్మిదో నెల రాగానే డెలివరీ కోసం వైద్యశాలకు వెళ్తారు. ఆ సమయంలో సాధారణ కాన్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ ‘సిజేరియన్’కే ప్రాధాన్యత ఇస్తున్నారు కొందరు వైద్యులు. ‘ఇన్స్యూరెన్సు’ ఉందంటే ఇక వదలనే వదలరు. కళ్లముందు కాసుల కట్టలు కనిపిస్తుంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి! పురిటినొప్పులు భరించగలవా... లేదంటే చెప్పు ముందుగానే ‘ఇంజక్షన్’ చేసేద్దాం... అనడమే కాకుండా ‘ఇంజక్షన్’ చేసేస్తారు. నెలలు నిండుతున్నా ‘పురిటి నొప్పులు’ ఛాయ కనిపించకపోవడంతో ‘మన ప్రమేయం లేకుండానే’ ‘ఆసుపత్రికి పరుగులు పెట్టిస్తారు’. ‘ఇన్స్యూరెన్స్’ ఉందికదా అని ‘్భరోసా’ ఇస్తారు. తీరా వైద్యచికిత్సలు ప్రారంభం అయిన తరువాత ‘ఇన్స్యూరెన్స్ వర్తించదని’, దానికి రకరకాలుగా కారణాలు ఉన్నాయని చెబుతారు. అప్పకప్పుడు ఏమీ పాలుపోని స్థితికి మనకు తెలియకుండానే మనల్ని ‘సిద్ధం’ చేస్తారు. చేసేదేముంది.. ‘నిండా మునిగిన తరువాత చలి ఉండదన్నట్టు’ వేడిపుట్టిస్తారు. కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు పేదల రక్తాన్ని తమ ఖరీదైన కార్లకు పెట్రోలుగా పోసుకుని కాసుల ‘కట్టలు’ గుట్టలుగా పోగేసుకుంటున్నాయ. ఇదిలావుంటే ఎలాగూ ఆ‘పరేషన్’ తప్పదని భావించే మరికొందరు ముహూర్తం పెట్టుకుని కాన్పులు (అదే సిజేరియన్) చేయంచుకుంటున్నారు. మరికొన్ని ఆసుపత్రుల్లో సీనియర్ నర్సులే డాక్టర్ చేయాల్సిన సిజేరియన్ కూడా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదేమని ప్రశ్నించే పరిస్థితి ఉండదు... ‘లేబర్ రూమ్’లోకి తీసుకెళ్లిన తరువాత అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. అక్కడ ఎవరు ఆపరేషన్ చేస్తున్నారో... వారికేం మందులు ఇస్తున్నారో కూడా మనకు తెలియనివ్వరు. మనకు ‘బిల్లు’ ఎంతకట్టాలో మాత్రం విడమరిచి చెబుతారు. బిడ్డ పుట్టాక ‘బిల్లు కట్టకపోతేనో...’ రీజన్‌తో ముందుగానే అడ్వాన్సు కట్టించుకుని సదరు వైద్యులు ‘ముందుజాగ్రత్త’ పడతారు కూడా. ‘ఇంతెందుకు సర్కారు దవాఖానాకు పోవచ్చుకదా’ అని మన మనసులో పొరపాటున ఆలోచన వచ్చినా అక్కడి పరిస్థితిని ముందుగానే ఊహించుకుని ‘్భబోయ్’ అని మనకు మనమే సర్దిచెప్పుకుని ఆ ఆలోచనే ఓ పెద్ద నేరమో... ఘోరమో అన్నట్టు మనం ఫీలవుతుంటాం. అటువంటి ఆలోచనే ‘దుర్మార్గమన్నట్టు’ మెదడు నుండి తుడిచిపారేస్తాం. కొందరైతే ‘మరీ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నానేంటి’ అనే స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రతి 100 కాన్పుల్లో సుమారు 98 డెలివరీలు సిజేరియన్ ద్వారా అవుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు ‘పాలుపోసి’ పోషిస్తున్నాం. మన ఆలోచన ధోరణి మారనంతవరకు సదరు ‘కార్పొరేట్ కాలనాగుల కోర’లకు బలికాక తప్పదు.