కృష్ణ

రూ.38కోట్లతో ప్రతి ఇంటికీ కుళాయి కనక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు మండలంలో రానున్న ఆరు నెలల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనక్షన్ మంజూరు చేసి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. చిన్నాపురం గ్రామంలో 14 ఎకరాల్లో సీపీడబ్ల్యుసి స్కీం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. మరో 20 ఎకరాలు గుర్తించి మొత్తం 35 ఎకరాల్లో సీపీడబ్ల్యుసి స్కీం ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ కుళాయి కనక్షన్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు గాను రూ.38కోట్లతో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. సెప్టెంబర్ నెలలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో రెండవ రైతు బజారు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. మార్కెట్ యార్డు పర్యవేక్షణలో ఏర్పాటు చేసే మార్కెట్ యార్డుకు పురపాలక సంఘ స్థలాన్ని గుర్తించి త్వరలో లీజు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఎంపీ నిధులు కోటి రూపాయలతో రోడ్ల నిర్మాణానికి గాను కలెక్టర్ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. ఎస్‌పీడీఎఫ్ నిధుల కింద నియోజకవర్గానికి రూ.2కోట్లు మంజూరవ్వగా కోటి రూపాయలు పైగా కోట్లు మేర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.89లక్షలకు గాను ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణరావుతో పాటు మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు ఇలియాస్ పాషా, కుంచే దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.