కృష్ణ

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు: పండించిన పంటకు గిట్టుబాటు ధర, రైతు రుణ విముక్తి కల్పించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆమోదం తెలిపే వరకు పోరాటం చేస్తామని రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాధ్ అన్నారు. స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుకు ప్రయోజనం, లాభం చేకూర్చే రుణ విముక్తి, గిట్టుబాటు ధరను కల్పించే రెండు బిల్లులకు పార్లమెంట్‌లో ఆమోదం కొరకు రైతులు ఉద్యమించాలన్నారు. అందుకు గాను ఈ నెల 28వ తేదీన ట్రావెలర్స్ బంగ్లాలో రైతాంగ సమాఖ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. అన్ని రాష్ట్రాల్లో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, కూరగాయలు, వ్యవసాయం, మత్స్య, రొయ్యల సాగుల ద్వారా వచ్చే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని, దీనికి గాను రైతులు ప్రత్యేక పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రూ.2 కోట్లతో ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన

కూచిపూడి, మే 25: మొవ్వ మండలం అయ్యంకి శివారు ఐనంపూడి డ్రెయిన్‌పై రూ.2కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 216ఎ జాతీయ రహదారి పామర్రు నుండి చల్లపల్లికి విస్తరించేందుకు జాతీయ రహదారుల శాఖ చర్యలు చేపట్టిందా అనే అనుమానాలు ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏలూరు, గుడివాడ, చల్లపల్లి మీదుగా ఒంగోలుకు 216ఎ జాతీయ రహదారిని నిర్మించేందుకు చర్యలు చేపట్టగా కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కారణంగా 216 జాతీయ రహదారి గుడివాడ నుండి మచిలీపట్నం మీదుగా నిర్మించారు. అయితే పూర్తి స్థాయిలో రహదారి నిర్మించలేదు. కాగా ప్రస్తుతం 216ఎగా గుడివాడ నుండి పామర్రు వరకు రహదారిని నిర్మించి కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. తదుపరి గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంత రాజకీయ నాయకులు 216ఎని పామర్రు నుండి కూచిపూడి, మొవ్వ, చల్లపల్లిలో 216లో కలపాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకురావటంతో ప్రభుత్వం అందుకు మార్గం సుగమం చేసినట్లుగా అయ్యంకి శివారు ఐనంపూడి వంతెనపై విశాలమైన వంతెన నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తాత్కాలిక డైవర్షన్ రోడ్డును ఏర్పాటు చేసి నిర్మాణాన్ని వేగవంతం చేశారు.