కృష్ణ

వచ్చే ఎన్నికల్లో థర్డ్ ఫ్రెంట్‌దే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్, మిత్ర ధర్మాన్ని విస్మరించి విభజన హామీలు అమలు చేయని బీజేపీ దేశాన్ని పాలించే అర్హత కోల్పోయాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. ఇక్కడి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో గళమెత్తారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో థర్డ్ ఫ్రెంట్ కీలక పాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తులే ప్రధాని పదవిలో కూర్చోనున్నారన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే విషయంలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీని తీవ్రంగా మోసగించి బీజేపీ రానున్న ఎన్నికల్లో తెలుగు ప్రజల ఆగ్రహాన్ని చవి చూడనుందని స్పష్టం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మీద బీజేపీపై సమరశంఖం పూరించనున్నట్లు చెప్పారు. స్వార్ధ రాజకీయాల కోసం బీజేపీతో కుమ్మక్కైన వైసీపీకి కూడా బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణరావు పేర్కొన్నారు.