కృష్ణ

ఆశల పల్లకిలో మినుము రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మొవ్వ మండలంలో మినుము పంట వేసిన రైతులు ధర గిట్టుబాటు లేకపోవటంతో అధిక ధరల కోసం మినుములను గోదాముల్లో నిల్వ చేశారు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ధరలకే అమ్మకాలు కొనసాగించినా భూస్వాములు కొందరు నిల్వ చేశారు. ఈ నేపథ్యంలో క్వింటాలు రూ.5,400లకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో గోదాములోని మినుములను జల్లేడవేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములకు తరలించేందుకు సిద్ధపడుతున్నారు. మినుముల కొనుగోలుకు గోదాముల అధికారులు గోతాలు సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ రూ.4,300 పలకటంతో ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకే అమ్ముకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖాధికారుల అనుమతి పత్రాలు కోసం పెద్ద ఎత్తున మొవ్వ కార్యాలయానికి తరలి వస్తున్నారు.

కొత్తమంగాపురంలో దాహం కేకలు

మైలవరం, మే 26: మండలంలోని పుల్లూరు శివారు కొత్తమంగాపురంలో ప్రజలు దాహంతో అలమటిస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదని సీపీఎం మండల కార్యదర్శి రావూరి రామారావు ఆరోపించారు. శనివారం గ్రామస్తులతో కలిసి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ ఓవర్ హెడ్ ట్యాంకు వాల్వ్ చెడిపోయి ఏడాది గడుస్తున్నా అనేక సార్లు ఈవిషయాన్ని గ్రామసర్పంచ్‌కు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. గ్రామంలో మంచినీటి సమస్యతోపాటు వీధి లైట్లు వెలగటం లేదని, చీకట్లో ప్రజలు మగ్గుతున్నారని, గ్రామంలో 20 ఏళ్ళ క్రితం పాడుబడిన బావిని ఎన్నార్‌ఈజిఎస్ పధకం కింద పూడ్చివేయమని చెప్పినా పట్టించుకోవటం లేదని వాపోయారు. అనేక జన్మభూమి సభలలో వినతులు అందించినా ఫలితం లేదన్నారు. గ్రామ సమస్యలపై అధికారులు స్పందించకపోతే మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.