కృష్ణ

నీరు-చెట్టు పథకం కింద చెరువుల్లో పూడిక తీయాలి:కాగిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, మే 3: నీరు-చెట్టు పథకం ద్వారా చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో నీరు-చెట్టు పథకాన్ని భాగస్వామ్యం చేసి గ్రామాల్లోని మంచినీటి చెరువులు, ఊర చెరువులు, పశువుల చెరువుల్లో పూడిక తీయాలన్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇంకుడు గుంటలను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. పంట సంజీవని పథకం ద్వారా పంట పొలాల్లో ఇంకుడు గుంటలను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ అధికారులు మాట్లం, లక్ష్మీపురం, పల్లెపాలెం పంచాయతీలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలన్నారు. ఎఎంసి ఛైర్మన్ వాటాల నరసింహస్వామి, ఎంపిపి వలవల సత్యనారాయణ, జెడ్పీటిసి వి తులసీరావు, డిసి ఛైర్మన్ నిక్కంటి విజయ భాస్కరరావు, మండల అధ్యక్షులు గుడిశేవ కనకయ్య, సర్పంచ్‌లు ఎంపిటిసిలు పాల్గొన్నారు.