కృష్ణ

నీతి ఆయోగ్ వేదికగా దేశం దృష్టికి రాష్ట్ర ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ వేదికగా రాష్ట్ర ప్రగతిని దేశం దృష్టికి తీసుకువెళ్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సోమవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జల సంక్షరణ, పంట మార్పిడి, పండ్ల తోటల అభివృద్ధి, తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చామని, ఏపీ విధానాలు జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయన్నారు. పంటల మద్దతు ధరలో లోపాలను చర్చనీయాంశం చేశామని, స్వామినాథన్ సిఫారసులు అమలు చేయకపోవడాన్ని నిలదీశామన్నారు. రైతుల రాబడి రెట్టింపు అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించామన్నారు. నీటి నిర్వహణలో మొదటి మూడు స్థానాల్లో ఏపీ ఉందని, మొదటి స్థానం పొందేందుకు మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు. రెయిన్ గన్, జీబా టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాది నాటికి గ్రామాలకు తాగునీటి రవాణా ఉండకూడదన్నారు. నీటి భద్రత ఇవ్వడమే కాకుండా, నాణ్యమైన నీటిని అందుబాటులోకి తేవాలన్నారు. 35 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉంటే, వ్యవసాయ బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు. మద్దతు ధర, డిమాండ్‌ను అనుసరించి, పంట మార్పిడి ప్రోత్సహించాలన్నారు. జూన్‌లో 1000 కోట్ల రూపాయల మేర ఉఫాధి హామీ పనులు చేయాలని ఆదేశించారు. ఓడీఎఫ్ తరహాలో సాలిడ్‌వేస్టు మేనేజ్‌మెంట్‌పై దృష్టిసారించాలన్నారు. వ్యవసాయంలో సంక్షోభం అధిగమించామని, జల సంరక్షణ ముమ్మరం చేయాలన్నారు. జనవరి నాటికి ప్రజల్లో సంతృప్తి స్థాయి 90 శాతానికి చేరుకోవాలన్నారు.