కృష్ణ

విద్యాశాఖాధికారుల ఆదేశాలు బేఖాతరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: విద్యా శాఖాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మొవ్వ మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు యధావిధిగా తరగతులు కొనసాగాయి. వడగాల్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళ, బుధ, గురువారాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా స్థానిక శ్రీ మేధ ఇంగ్లీష్ మీడియం, హోలిస్పిరిట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు యధావిధిగా కొనసాగాయి. విషయం తెలుసుకున్న ఎంఇఓ తోట వెంకటేశ్వరరావు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులను ఇళ్లకు పంపి మిగిలిన విద్యార్థులకు తరగతులు నిర్వహించారు.

కాంగ్రెస్‌తోనే ప్రతి ఒక్కరికీ భరోసా
* కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి * యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 5కె రన్

విజయవాడ, జూన్ 19: సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరగాలన్నా, పేదవాడు ప్రశాంతంగా ఉండాలన్నా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రతి ఒక్కరికీ ఒక భరోసా లభిస్తుందని కేంద్ర మాజీమంత్రి, పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు పనబాక లక్ష్మి పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 48వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏపీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత మంగళవారం ఉదయం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాచౌక్ నుంచి 5కె రన్‌ను ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్‌వలీ జెండా ఊపి ప్రారంభించారు. 5కె రన్‌లో ఏపీసీసీ నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొని 5కె రన్ విజయవంతం చేశారు. అనంతరం ఆంధ్రరత్న భవన్‌లో రాహుల్‌గాంధీ 48వ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అతిధిగా పాల్గొన్న పనబాక లక్ష్మి, గిడుగు రుద్రరాజు, తదితరులు కేక్ కట్ చేసి యువజన నాయకులకు పంచిపెట్టారు. అనంతరం కార్యకర్తలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నేడు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పైనే మొదటి సంతకం చేస్తామని రాహుల్ చెప్పారన్నారు. ఈ పిలుపుని ప్రతి ఒక్కరికీ తెలియజేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ఇన్‌ఛార్జి ఉమెన్ చాందీ ఆదేశాల ప్రకారం తామంతా ప్రజల్లోకి వెళతామని, ప్రతి ఇంటికి వెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్‌వలీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.