కృష్ణ

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. సైబర్ నేరాలకు ఎటువంటి అస్కారం ఇవ్వకుండా ప్రజలు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఎకౌంట్లలోని డబ్బు స్వాహాకు గురవుతుందన్నారు. ఇప్పటికే ఓటీపీ ద్వారా జరిగే నేరాలు ఒక వైపు అయితే ఇంటర్నేట్ ద్వారా లాటరీ పేరుతో అమాయక ప్రజలను వారి ఉచ్చులో దింపి, వారి నుండి సొమ్మును స్వాహా చేస్తున్నారన్నారు. ఇవేకాకుండా ఉద్యోగాల పేరుతో కూడా నిరుద్యోగ యువతకు ఎర వేస్తున్నారన్నారు. వీటిని గుడ్డిగా నమ్మి వారు అడిగిన మొత్తం వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోటోలు, వీడియో మార్ఫింగ్ చేస్తూ ఆడ పిల్లల జీవితాలతో కొంత మంది చెలగాటమాడుతున్నారన్నారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టాలు అమలు చేస్తామన్నారు.