కృష్ణ

నర్సరీలకు తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంపలగూడెం, జూన్ 23: కృష్ణాజిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ విజయకృష్ణన్ ఉత్తర్వుల మేరకు మండలంలోని 26 నర్సరీలకు శనివారం సాయంత్రం స్థానిక తహశీల్దార్ సకీరున్సీసా బేగం ఆధ్వర్యంలో తాళాలు వేశారు. రెండు సంవత్సరాల క్రితం నకిలీ మిరప నారు వల్ల పెనుగొలను తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నష్టపోయిన రైతులకు నేటికి పరిహారం అందజేయకపోవడంతో ఈ నెల 24వ తేదీన రైతులు పాదయాత్ర ప్రారంభిస్తున్న తరుణంలో నర్సరీలకు తాళాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్, ఆర్‌ఐ, విఆర్‌ఒలు పాల్గొన్నారు.

నిర్విఘ్నంగా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి

* తిరుపతమ్మకు బోనాల సమర్పణ

పెనుగంచిప్రోలు, జూన్ 23: నవ్యాంధ్ర జీవనాడి ఆయిన పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా ఆశీర్వదించాలని కోరుతూ స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారికి జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల తెదేపా నాయకులు శనివారం బోనాలు సమర్పించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో జడ్‌పీటీసీ గింజుపల్లి శ్రీదేవి, ఎంపీపీ వెల్ది జ్యోతి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోడె క్రాంతితో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయం వద్ద ఉన్న పొంగళ్ల షెడ్డులో పాలు పొంగళ్లు నిర్వహించి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఎఇఒ మేడా గోపాలరావు, ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుపతమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా పోలవరం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు శరవేగంగా నడిపిస్తున్నారన్నారు. పోలవరం పూర్తి అయితే రాష్ట్రం ధాన్య బండాగారంగా నిలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి మనుగడ ఉండదన్న భయంతో అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పలు కుట్రలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నెలకొన్నా పోలవరం నిర్మాణ పనులు ఆగడం లేదని, త్వరితగతిన పూర్తి అయ్యేలా అమ్మవారి ఆశీర్వచనాలు కోరుతూ బోనాలు సమర్పించడం జరిగిందన్నారు. అలాగే దేశంలోనే మొట్ట మొదటి సారిగా నదుల అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా కృష్ణా, డెల్టా రాయలసీమలో 18లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. అనంతరం నాయకులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ, జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్‌లు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, మల్లెల గాంధీ తదితరులు పాల్గొన్నారు.