కృష్ణ

సంతృప్తికర సేవలే ప్రధాన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: ప్రజా పంపిణీ వ్యవస్ధలో సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులను సకాలంలో అందించి వారిని సంతృప్తి పర్చటమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి చెప్పారు. శనివారం సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మన్‌గా రామకృష్ణారెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించిన అనంతరం నూజివీడు లో సివిల్ సప్లై మండల స్ధాయి ఎంఎల్‌ఎస్ పాయింట్లను గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్‌షాపులకు వెళ్ళే సరుకుల వివరాలు, స్టాకు వివరాలు పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ పదవిని చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో 1.36 లక్షల తెల్లకార్డులు ఉన్నాయని, వీరందరికీ సకాలంలో రేషన్ సరుకులు అందించి, వారికి సంతృప్తి పర్చటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయలను దీని కోసం వ్యయం చేస్తోందని చెప్పారు. సరుకులు పంపిణీ లో వ్యత్యాసం ఉంటే తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఉందని చెప్పారు. నూజివీడు పాయింట్ నుండి 135 దుకాణాలకు సరుకులు సరఫరా అవుతున్నాయని అన్నారు. కార్పోరేషన్‌లో సిబ్బంది కొరత ఉన్నప్పటకీ నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. సంస్ధ ద్వారా తెల్లరేషన్‌కార్డులు ఉన్నవారికి, అంగన్‌వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన పధకానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. హామాలీల కూలీ రేట్లు పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామకృష్ణారెడ్డి వెంట సంస్ధ ఎండీ సూర్యకుమారి, ఓఎస్‌డి రామనర్సయ్య, జోనల్ అధికారులు సిహెచ్ రామనుజమ్మ, రాజేశ్వరీ, ఏఎస్‌ఒ శ్యామ్‌కుమార్, రెవిన్యూ అధికారులు నాగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కప్పలవాగును కప్పెట్టేశారు

జి.కొండూరు: కొందరి స్వార్ధపూరిత చర్యలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. దీని ఫలితంగా బహిరంగ ప్రజాప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందరికీ చెప్పాల్సిన స్థితిలో ఉంటున్న వారే ఇటువంటి చర్యలకు పాల్పడటం గమనార్హం. వివరాల్లోనికి వెళితే జి.కొండూరు నుంచి పినపాక వెళ్ళే రోడ్డు మార్గమధ్యంలో ఇరుగ్రామాల సరిహద్దులో కప్పలవాగు ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఈ వాగు ప్రవహిస్తుంది. ఎగువన కొండలపై పడిన వర్షపు నీరు ఈ వాగు గుండా ప్రవహించి పులివాగుకు, సమీప చెరువులకు చేరుతుంది. దీన్ని ఇటీవల ఓ వ్యక్తి తన పొలాన్ని చదును చేయించి, దాని పక్కన ఉన్న రోడ్డును అభివృద్ధి చేశాడు. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ వాగును మాత్రం పూర్తిగా పూడ్చేశాడు. ఇదేమిటని రైతులు విమర్శిస్తున్నారు. గతంలో కప్పలవాగును, దానిపై ఉన్న రహదారిని ప్రస్తుత ఎఎంసి చైర్మన్ వుయ్యూరు వెంకట నరసింహారావు అభివృద్ధి చేశారు. ఆయన అభివృద్ధి చేసిన వాగు ప్రస్తుతం కొద్దిమీటర్ల మేర రూపురేఖలను కోల్పోయింది. జలవనరుల శాఖ అధికారులు స్పందించి వాగును తవ్వించి, యథావిధిగా ఉంచాలని కోరుతున్నారు. లేకుంటే వరదనీరు భవిష్యత్తులో పొలాలను ముంచెత్తడం ఖాయమని పేర్కొంటున్నారు. దీనిపై ఇరిగేషన్ ఎఇ వల్లూరు పట్ట్భారామయ్య చౌదరిని వివరణ కోరగా వాగును పరిశీలించి తగుచర్యలు తీసుకుంటామన్నారు.

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
రెడ్డిగూడెం, జూన్ 23: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పధకాలు, గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక వసతులు కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలో ఒక్కరోజే రూ. 5.85 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు. రెడ్డిగూడెంలో 15లక్షల రూపాయలతో, నాగులూరులో 22లక్షల రూపాయలతో నిర్మించిన పంచాయితీ భవానాలను ప్రారంభించారు. 2కోట్ల రూపాయలతో వెలగలగూడెం నుండి నరుకుళ్ళపాడుకు రోడ్డు, 48లక్షలతో కోతుల వాగుపై బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో 2895 కొత్త పింఛన్లు మంజూరు అయ్యినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10లక్షల మంది నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నామన్నారు. గతంలో మైలవరంలో తనను విమర్శించిన నాయకునికి కాలమే సమాధానం చెప్పిందని, ఇప్పుడు ఆ నాయకుడు ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో డబ్బు సంచులతో వచ్చే వారికి గోదావరి నీళ్ళతో సమాధానం చెబుదామని సృష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కె విజయబాబు, ఎంపీపీ తోటకూర నారాయణరావు, జడ్‌పిటిసి సభ్యురాలు పాలంకి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.