కృష్ణ

దళితుల అభ్యున్నతే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: దళితుల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ‘దళిత తేజం - తెలుగుదేశం’ పేరిట రెండు నెలల పాటు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చి ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు సాగుతున్నారని శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లుగా దళితుల కోసం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆ వర్గాలకు తెలియ చేసేందుకు గాను ఈ నెల 30వ తేదీన నెల్లూరులో దళిత తేజం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దళిత సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లా నుండి 50 బస్సుల ద్వారా ఒక్కొక్క గ్రామం నుండి ఐదు నుండి పది మంది వరకు దళితులను తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. దళితుల కోసం కేటాయించిన నిధులను ఆ వర్గాలకే వినియోగిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత పాలకులు దళితవాడలను చిన్న చూపు చూశారని, దళితుల కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. నేడు దళితవాడల్లో 95 శాతం వౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. సాధికార మిత్రలతో పాటు దళితుల కోసం ప్రతి 35 దళిత కుటుంబాలకు ఒక దళిత మిత్రలను నియమించి దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కార చర్యలు చూపుతున్నామన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి రోజు రోజుకీ దిగజారుడు రాజకీయాలకు చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీల రాజీనామాలను కేంద్రంతో ఆమోదింప చేసుకున్నారన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందన్నారు. రెండు పార్టీలు సరికొత్త డ్రామాలతో ప్రజలను అమాయకులను చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. 11 కేసుల్లో ప్రధాన నిందితుడైన జగన్ రాజకీయాలను ప్రక్షాళన చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈవెంట్ మేనేజర్ అయిన ప్రశాంత్ కిషోర్ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం (తాతయ్య), రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు వేమూరి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పివి ఫణికుమార్ పాల్గొన్నారు.