కృష్ణ

దేశ అమూల్య సంపద ‘బాలలే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: భారతదేశానికి అమూల్యమైన సంపద బాలలే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు అన్నారు. శనివారం జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలోని న్యాయ సేవాసదన్‌లో జువైనల్ జస్టిస్ అనే అంశంపై పోలీసు అధికారులు, బాలల సంక్షేమాధికారులు, పారా లీగల్ వాలంటీర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి లక్ష్మణరావు మాట్లాడుతూ నేడు ఎక్కువ మంది బాలలు నిరాదరణకు గురవుతుండటం బాధాకరమన్నారు. అనేక కారణాలతో ఇంటి నుండి వెళ్లిపోవడం, సంఘవిద్రోహుల చేతుల్లోకి వెళ్లడం సర్వ సాధారణమైందన్నారు. ఇందుకు పేదరికం ఒక కారణమైతే వారి పట్ల ప్రేమ, ఆదరణ లేకపోవటం మరో కారణమన్నారు. బాలల హక్కులు కాపాడి వారిని సమాజంలో విలీనం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, అధికారులు, న్యాయవాదులు, వ్యక్తులు బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నిరాదరణకు గురైన బాలలను విస్మరిస్తే ప్రమాదకర సంఘ విద్రోహులుగా మారే ప్రమాదం ఉందన్నారు. వారిని సన్మార్గంలో నడిపి సమాజానికి దిక్సూచిగా తీర్చిదిద్దాలన్నారు. నేర సంఘటనలు జరిగిన సందర్భాలలో 18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారిని వయస్సు నిర్ధారణ చేసుకోవాలని, వారి హక్కులు కాపాడాలని, సమాజంలో మంచి వ్యక్తులుగా మార్పు తేవాలని పోలీసు దర్యాప్తు అధికారులకు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ న్యాయస్థానాలకు చెందిన న్యాయమూర్తులు రామకృష్ణ, జయరాజు, రజని, మల్లిఖార్జునరావు, శాశ్వత లోక్ ఆదాలత్ చైర్మన్ పుండరీకాక్షయ్య, పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆకుల వెంకట్రామయ్య, సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.