కృష్ణ

ఎట్టకేలకు సర్వశిక్షాభియాన్ పిఓ పోస్టుకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 1: సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుకు మోక్షం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. జిల్లా ఆడిట్ కార్యాలయంలో సహాయ ఆడిట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న బోయిన కృష్ణమోహన్‌ను డెప్యుటేషన్‌పై ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వం జివో నెం. 58ని విడుదల చేసింది. సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న ఈ పోస్టులో జిల్లా విద్యా శాఖాధికారులుగా పని చేసిన వారు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరించారు. ప్రస్తుతం డిఇఓ ఎ సుబ్బారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు పూర్తి స్థాయి అధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా నియమితులైన కృష్ణమోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు శుక్రవారం ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలిపారు.

గోదావరి కుడికాలువ గట్లు పటిష్ఠపరచాలి
* కలెక్టర్ బాబు ఎ
విజయవాడ, ఏప్రిల్ 1: పట్టిసీమ నుండి గోదావరి కుడి కాలువ ద్వారా గోదావరి వరదనీరు కృష్ణా జిల్లాలో కలిసే ప్రాంతాల వరకు ఉన్న కాల్వగట్లు పటిష్టంగా వుండేవిధంగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనిచేయాలని జిల్లా కలెక్టర్ బాబు ఎ సూచించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఇరిగేషన్ ఎన్‌టిటిపిఎస్, రైల్వే, నేషనల్ హైవే అథారిటీస్, యాక్టివ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అధికారులతో పోలవరం కుడికాలువ, బుడమేరు కాలువల పటిష్టత పనులపై సమన్వయం సమావేశం జరిగింది. జూన్ నెలలో పోలవరం కుడికాలువ, బుడమేరు ద్వారా 37 వేల 550 క్యూసెక్కుల వచ్చే వరద ప్రవాహంపై ప్రస్తుతం ఉన్న కాలువగట్ల సామర్థ్యాలను జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌టిటిపిఎస్ వద్ద చేపట్టవలసి ఉన్న 1.4 కి.మీ కాలువ విస్తరణ పనులను మూడు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి 50 రోజుల్లో పనులు పూర్తిచేయాలని జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ సిహెచ్ రామకోటిలింగేశ్వరరావుకు కలెక్టర్ సూచించారు. ఎన్‌టిటిపిఎస్ పటిష్ఠత కోసం ప్లాంట్ ప్రత్యేక ఇంజనీరింగ్ బృందం పర్యవేక్షణలో ఇరిగేషన్ ఇంజనీర్లు 1.4 కి.మీ కాలువ పనులు చేపట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌టిటిపిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ విజయానంద్‌తో కలెక్టర్ ఫోన్ ద్వారా సంప్రదించి చేయవలసిన మార్గదర్శకాలను చర్చించారు. అదేవిధంగా రైల్వేశాఖ ద్వారా జరుగుతున్న పనులను మే 15లోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులకు కలెక్టర్ సూచించారు. 37,550 క్యూసెక్కుల వరద ప్రవాహం తట్టుకునే విధంగా ఎన్‌టిటిపిఎస్ వద్ద ఉన్న పాత జాతీయ రహదారి పనులను తక్షణమే చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీస్ మేనేజర్ టెక్నికల్ కె.మధుసూధనరావుకు సూచించారు. పనులు చేపట్టటానికి నిధుల సమస్య లేదని, జూన్ నాటికి గోదావరి వరద జలాలు విడుదల కానున్నందున ఈ లోగా చేయవలసిన పనులు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాలువ పటిష్ఠత వలన వర్షాకాలంలో బుడమేరు వరదనీరు విజయవాడ నగరం రాకుండా నివారించవచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్, పోలవరం కుడికాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్లు రామకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, ఇఇ పోలవరం కెనాల్ మీరంశెట్టి, సంబంధిత శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు.