కృష్ణ

రాబోయే ఎన్నికల్లోనూ తెదేపా జయకేతనం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికచర్ల: రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వల్ల 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మండలంలో గల గొట్టుముక్కల గ్రామంలో సోమవారం ఉదయం ధనలక్ష్మీనగర్‌లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుండి గ్రామంలోని శివాలయం సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో నాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 135 శాసనసభ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందన్నారు. రాష్ట్రంలో గెలిచిన లోక్‌సభ సభ్యుల బలంతోనే కేంద్రంలో ప్రధాన మంత్రి ఎన్నిక అవుతారన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ నమ్మించి ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేశారని, విభజన చట్టం అమలులో విఫలం అయ్యారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమోఘమైన రాజకీయ చతురతతో రాష్ట్రాన్ని కేంద్రం సహయాన్ని లేకుండానే 1500రోజుల్లో అనేక నీటి పారుదుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి భారతదేశంలో 1వ స్థానంలో నిలిచారన్నారు. ఈ నెల 18 నుండి జరగనున్న లోక్‌సభ సమావేశాల్లో బీజెపీ ప్రభుత్వాన్ని మిగిలిన ప్రతిపక్షాలతో కలిసి నిలువునా ఎండగట్టి ఆరవేస్తామన్నారు. బీజెపీని రాబోయే ఎన్నికల్లో గెలవకుండా అడ్డుకుంటామన్నారు. ఈ సభలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీపీ వేల్పుల ప్రశాంతి, జిల్లా పరిషత్ సభ్యుడు కోగంటి బాబు, కంచికచర్ల, నందిగామ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు నన్నపనేని లక్ష్మీనారాయణ, చిరుమామిళ్ల బుజ్జి, వివిధ గ్రామాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.