కృష్ణ

క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యే లక్ష్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యే ప్రతి విద్యార్థి లక్ష్యం కావాలని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి అన్నారు. కళాశాలలో మొదటి సంవత్సర విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశం సోమవారం కళాశాలలోని లోటస్ హాల్‌లో నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగిస్తూ ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలున్నా వాటిని అందిపుచ్చుకునే సామర్థ్యం నేటి విద్యార్థులలో కొరవడిందన్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేయటం సాధారణ విషయమైందని, దాని వల్ల ఉపయోగాలు లేవన్నారు. 80 శాతం మార్కులకు పైబడి సాధించటంతోపాటు దానికి తగిన విధంగా స్కిల్స్‌ను పెంపొందించుకోవాలన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను రాజీ పడకుండా, ఖర్చకు వెనుకాడకుండా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా సీనియర్ అధ్యాపకులను నియమించి విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్లేస్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి ప్లేస్‌మెంట్ లభించే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గత యేడాది 600 మంది ప్లేస్‌మెంట్‌కు పోటీ పడగా వారిలో 530 మందికి పేరొందిన సంస్థలలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు లభించాయన్నారు. విద్యార్థుల ఉన్నతిలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకంగా ఉండాలన్నారు. ప్రిన్సిపాల్ కె అప్పారావు మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు సంబంధించిన వౌలిక వసతులు, డిజిటల్ లైబ్రరీ, అధ్యాపకులు తదితర విషయాలపై సుదీర్ఘంగా వివరించారు. తమ కళాశాలలో ర్యాగింగ్ చేస్తే వారిని డిబార్ చేయటం జరుగుతుందన్నారు. ఇప్పటికే దీనిపై అధ్యాపకులతో కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇన్‌ఫ్రా డైరెక్టర్ కె తిమ్మారెడ్డి, గోగులమూడి సత్యనారాయణరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, డీన్ రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. అనంతరం గత యేడాది ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, హాజరులో నూరు శాతం నమోదైన విద్యార్థులకు లకిరెడ్డి బాలిరెడ్డి తన భార్య సరస్వతి పేరున ఒక్కొక్క విద్యార్థికి పది వేల రూపాయల చొప్పున సుమారు 12.50 లక్షల రూపాయల నగదు బహుమతులను ప్రోత్సాహకంగా అందించారు. ఈకార్యక్రమంలో ప్రధమ సంవత్సరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వందలాదిగా పాల్గొన్నారు.

ఆ రాష్ట్రాల్లో ఎన్నికలకు బీజెపీకి భయం

నందిగామ, జూలై 16: కేంద్రంలో మంచి మెజార్టీతో బీజెపీ అధికారంలో ఉన్నా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికలకు భయపడే వాయిదా వేయాలని చూస్తుందని, సమయం అయిపోయినా కూడా ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించకుండా జమిలి ఎన్నికల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఎఎంసీ చైర్మన్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిరుమామిళ్ల శ్రీనివాసరావు ప్రశ్నించారు. తెదేపా ఆధ్వర్వంలో ప్రత్యేక హోదా నిరసనలో భాగంగా స్థానిక గాంధీ సెంటర్ వద్ద 118వ రోజు సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో మీరు చిత్తుచిత్తుగా ఓడిపోతారని భయపడే ఎన్నికలు వాయిదా వేస్తున్నారని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే రేపు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం ఎదుర్కోవాలన్నారు. విభజన అశాస్ర్తియంగా జరగడంతో పాటు 58శాతం జనాభా ఉంటే కేవలం 48శాతం నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు కొండూరు వెంకట రమణ, నాయకులు మనబోతుల శ్రీరామ, పంగా సతీష్, ఎంఎ ఖాజా, కిలారు ప్రసాద్, ఈవూరి వినోద్, అచ్చి చినబాబు, అచ్చి శేషు, షేక్ యాకూబ్, గోపు పూర్ణ, బసవయ్య, అడవిరావులపాడు, పల్లగిరి సర్పంచ్‌లు తోట కొండలు, వేల్పుల బిక్షాలు తదితరులు పాల్గొన్నారు.