కృష్ణ

అగ్రిగోల్డ్ ఆస్తులకు వేలం నిర్వహించి త్రిసభ్య కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన వేలం పాటను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధ్యక్షతన జిల్లాలోని అగ్రిగోల్డ్ ఆస్తులను ఏడు లాట్లుగా విభజించి వేలం టెండర్లను ఆహ్వానించారు. ప్రతి లాట్‌లోని ఆస్తికి హైకోర్టు రిజర్వు ధర నిర్ణయించింది. వీటిలో మూడవ లాట్ విజయవాడ మొగలరాజపురంలోని 630 చదరపు గజాల స్థలంలోని ఐదు అంతస్తుల భవనానికి హైకోర్టు రూ.11కోట్లు రిజర్వు ధర నిర్ణయించగా ఇరువురు వేలం పాటలో పాల్గొన్నారు. తుమ్మల చంద్రశేఖరరావు అనే పాటదారుడు రూ.11,11,11,111లకు సదరు ఆస్తిని వేలం పాటలో దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించి సదరు వ్యక్తి నుంచి వేలం ధరను తీసుకుని హైకోర్టు ఆదేశాల మేరకు వేలం ద్వారా పొందిన వ్యక్తికి ఆస్తిని స్వాధీన పరుస్తామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. మిగతా ఆరు లాట్ల వేలం పాటకు ఎవ్వరూ హాజరు కాలేదు. వేలం పాటలకు సంబంధించి హైకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ మరలా సమావేశమై తేదీలను ఖరారు చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ వేలంలో త్రిసభ్య కమిటీ సభ్యులుగా కలెక్టర్ లక్ష్మీకాంతం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, జిల్లా రిజిస్ట్రార్ బి శివరాంతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, సీబీ సీఐడీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎస్ త్రిమూర్తులు పాల్గొన్నారు.

‘అమృత’ హెల్త్ స్కీంతో అనాధలకు వైద్య సేవలు - కలెక్టర్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 16: అమృత హెల్త్ స్కీం కింద అనాధలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు హెల్త్ కార్డులు జారీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఇందుకు సంబంధించి హెల్త్ కార్డులను సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ మాదిరిగా ఈ పథకంలో కూడా 1044 వ్యాధులకు రూ.2.50లక్షలు వరకు కవరేజీ ఉంటుందన్నారు. ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించి అనాధలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 262 మంది అనాధలను గుర్తించి హెల్త్ కార్డులు అందచేసినట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెసీ విజయకృష్ణన్, డీఆర్‌ఓ అంబేద్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. పద్మజారాణి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో-ఆర్డినేటర్ డా. దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

నేటి నుండి జిల్లాలో కృత్రిమ అవయవాల ఎంపిక శిబిరాలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 16: జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు నేటి నుండి నాలుగు రోజుల పాటు కృత్రిమ అవయవాల ఎంపిక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 17, 18తేదీల్లో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎంపిక శిబిరం నిర్వహిస్తారన్నారు. అలింకో హైదరాబాద్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్తంగా నిర్వహించనున్న ఈ శిబిరంలో కృత్రిమ అవయవాలు, ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయడానికి విభిన్న ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 19, 20తేదీల్లో తిరువూరు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. చల్లపల్లి, మోపిదేవి, గంటసాల, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లోని విభిన్న ప్రతిభావంతులు ఈ శిబిరంలో పాల్గొనవచ్చన్నారు.