కృష్ణ

‘గ్రామదర్శిని’లో ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రూప కల్పన చేసిన గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు తెలుసుకుని ఆ దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా బుధ, గురువారాల్లో ‘గ్రామదర్శిని’ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కార చర్యలు చూపాలన్నారు. గ్రామ విలేజ్ డాక్యుమెంట్లు తయారు చేసి రానున్న జన్మభూమి గ్రామసభల్లో ప్రజలకు చదివి వినిపించాలన్నారు. ప్రజల సంతృప్తే ధ్యేయంగా జిల్లా అధికార యంత్రాంగం పని చేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లి అమలు చేస్తున్నామన్నారు. ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా అధికార యంత్రాంగం స్పందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. మానవతావ ధృక్పదంతో సేవలు అందిస్తున్న అధికారులను కలెక్టర్ అభినందించారు. ‘మీకోసం’లో వస్తున్న ప్రతి అర్జీని పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరుస్తున్నామన్నారు. 99.68 శాతం మేర మీకోసం అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. కిడ్నీ వ్యాధి ప్రభావిత మండలాలైన గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు మండల ప్రజలకు పౌష్ఠికరమైన ఆహారం అందించడంలో భాగంగా ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి మూడు కేజీల రాగులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 1వతేదీ నుండి ఈ పంపిణీ జరుగుతుందన్నారు. మూడు మండలాలకు సంబంధించి 60వేల 837 రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పంట రుణాలను కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను ఆదేశించారు. రూ.5వేల 400కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటికే రూ.3500కోట్లు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూ.1.94లక్షల కోట్లు కాగా దీనిలో 15.87శాతం జిల్లా వాటా సాధించినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయం ‘ఎ’ గ్రేడ్‌లో ఉందన్నారు. 3.30లక్షల హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 1.50 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పూర్తయినట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో నూరు శాతం వరి నాట్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. గత ఏడాది మత్స్య శాఖ 12లక్షల మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి సాధించగా ఈ ఏడాది ఇప్పటి వరకు 5లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. చేపల చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేసి చెరువు గట్లు పటిష్ఠంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్, డీఆర్‌ఓ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరావు, డీఇఓ ఎంవి రాజ్యలక్ష్మి, డీపీఓ విక్టర్, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.