కృష్ణ

పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యాభివృద్ధిపై అధ్యాపకులు సైతం నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని కృష్ణా యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్, జెఎన్‌టియుకె కాకినాడ ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్ రామకృష్ణారావు అన్నారు. స్థానిక ఎల్బీఆర్సీఇలో ఎంబిఏ విభాగం, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబిఏ విభాగం వారిచే అధ్యాపకులకు రెండు రోజుల పాటు విద్యాభివృద్ధిపై శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. రోల్ ఆఫ్ ఏ టీచర్ అండ్ రెఫ్లెక్టివ్ టీచింగ్ అనే అంశంపై నిర్వహిస్తున్న ఈశిక్షణా కార్యక్రమంలో రామకృష్ణారావు మాట్లాడుతూ అధ్యాపకులు ఎప్పటికప్పుడు తమ బోధనా నైపుణ్యాలకు పదును పెడుతూ వాటిని విద్యార్థులకు అందించాలన్నారు. మలేసియాలోని లింకన్ యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అమియా భౌమిక్ మాట్లాడుతూ భారతీయ విలువలతో కూడిన విద్యావిధానం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ పరిశ్రమకు అవసరమైన నూతన విధానాలను బోధనా పద్దతులను, నూతన కోర్సులను పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ సలహాదారు డాక్టర్ సిఎల్ వెంకట్రావ్ మాట్లాడుతూ విద్యార్థులకు మొదట వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసి తర్వాత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయించి పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు అభివృద్ధి చేసి పరిశ్రమకు ఉన్న కొరతను తీర్చవచ్చన్నారు. హైదరాబాద్‌కు చెందిన డేటావైస్ సీఈఓ వినయ్‌కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు అధ్యాపకులకు ఎంతో అవసరమన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్ ప్రెసిడెంట్ ఎన్వీ రవీంద్ర, కోశాధికారి పి నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను ప్రతియేటా దేశంలోని మేనేజ్‌మెంట్ కళాశాలల్లో నిర్వహిస్తుంటుందన్నారు. బ్రిగేడియర్ పి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి అధ్యాపకుడు ఇంటరాక్టివ్ బోధనా పద్దతులను అలవరచుకోవాలని దాని వల్ల అట్టడుగు విద్యార్థులు కూడా ఉన్నత శిఖరాలను అందుకోగలరన్నారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు తమ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని చైర్మన్ ఎల్ బాలిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, కోచైర్మన్ ప్రకాష్‌రెడ్డి వెల్లడించారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 125 మంది అధ్యాపకులు హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ కె అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి, ఇన్‌ఫ్రా డైరెక్టర్ కె తిమ్మారెడ్డి, ఎంబిఏ విభాగాధిపతి ఆదిశేషారెడ్డి, డీన్స్, వివిధ విభాగాధిపతులు హాజరయ్యారు.

జి.కొండూరులో ధర్నాలో ప్రతిపక్షాల ఆవేదన

జి.కొండూరు, జూలై 17: కిడ్నీ వ్యాధుల బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జి.కొండూరులో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం కిడ్నీ వ్యాధుల బాధితులు ధర్నా చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫ్లోరైడ్ నీటి కారణంగా కిడ్నీ వ్యాధి స్ధానికంగా తీవ్రరూపం దాల్చిందన్నారు. వందలాది మంది కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక్కొక్కరికి వైద్యం, ప్రయాణం, మందులు అన్ని ఖర్చులు కలిపి రూ.5వేల నుంచి రూ.7వేల వరకూ ప్రతినెలా ఖర్చవుతోందన్నారు. కిడ్నీ బాధితులు అనారోగ్యంతో పనులకు వెళ్ళ లేక వారి పిల్లలను చదువులు మాన్పించి పనులకు పంపిస్తున్నారని, వచ్చిన కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారన్నారు. కాలక్రమంలో అప్పులు చేస్తూ జీవితాన్ని మరింత నరకం చేసుకుంటున్నారన్నారు. మండల వ్యాప్తంగా 40 మంది వరకూ బాధితులున్నారని, వీరిలో 15 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారన్నారు. కొందరు భయపడి డయాలసిస్ చేయించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం కిడ్నీ వ్యాధులకు గురైన వారికి మండల కేంద్రాల్లో వ్యాధి నిర్ధారణ, తీవ్రతను గుర్తించే పరీక్షలు, డయాలసిస్ యూనిట్‌లు ఉచితంగా ఏర్పాటు చేసి, సేవలందించాలన్నారు. ఉచితంగా మందులను అందచేస్తూ వారికి ప్రత్యేకంగా పింఛన్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శి సభ్యులు పివి ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు కోట కళ్యాణ్, మండల కార్యదర్శి పంది సాంబశివరావు, ఎంపిపి వేములకొండ తిరుపతిరావు, జనసేన నేత ఎర్రబోలు నాగేశ్వరరావు, కిడ్నీ వ్యాధుల బాధితులు తదితరులు పాల్గొన్నారు.