కృష్ణ

రెండు ముక్కలైన ఆర్‌అండ్‌బి రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ. మండలంలోని వెంకట రాఘవాపురం నుండి అరిపిరాల వెళ్లే ఆర్ అండ్ బి రహదారి నిలువునా రెండు ముక్కలైయ్యింది. ఇటీవల నూతనంగాఈ రోడ్డును తారురోడ్డుగా నిర్మించిన నాలుగు నెలలకే నిలువునా రెండు ముక్కలయందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారికి ఇరువైపులా కాలువలు ఉండటం, రోడ్డు నిర్మాణం చేసినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ విధంగాజరిగిందని స్థానికులు అంటున్నారు. నాణ్యమైన మెటీరియల్ వినియోగించి తగిన జాగ్రత్తలతో రోడ్డు నిర్మాణం చేస్తే ఇలా బీటలు వారేదికాదని స్ణానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు కింద నేల గట్టిగా లేకపోవడం వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇలా రహదారి ముక్కలైయ్యిందన్నారు. రోడ్డు నిర్మాణం తర్వాత నాణ్యతను పరిశీలించిన అధికారులు కూడా రహదారిని నాసిరకంగా నిర్మాణం చేశారనే విషయాన్ని గ్రహించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఈ రహాదారిని పరిశీలించి పట్టిష్టంగా నిర్మాణం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

‘కూచిపూడి’ డాక్టరేట్లపై మలేసియాతో ఒప్పందం

కూచిపూడి, జూలై 17: కూచిపూడి నాట్యారామం, మలేసియా దేశంలోని లింకన్ విశ్వవిద్యాలయంతో కూచిపూడి నాట్యంలో పీజీ డిగ్రీ ప్రదానాలపై పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం నాట్యక్షేత్రం కూచిపూడిలోని శ్రీసిద్ధేంద్రయోగి కూచిపూడి కళాపీఠంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా. హామియా హోమిక్‌తో నాట్యారామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ ఈ మేరకు అంగీకారం కుదుర్చుకున్నారు. మలేసియాలో కూచిపూడి నాట్యం నేర్చుకున్న ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు నాట్యారామంలో తుది శిక్షణ పొంది డాక్టరేట్ పట్టాను అందుకునే అవకాశం ఉంటుందని ఆనంద్ పేర్కొన్నారు. అలాగే మలేసియాలో కూచిపూడి నాట్యంతో పాటు ఇతర భాషలపై పరిశోధనలు చేసే వారికి డాక్టరేట్‌ను అందచేయనున్నట్లు వీసీ డా. హామియా హోమిక్ తెలిపారు. సమావేశంలో స్వచ్ఛాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా. సీఎల్ వెంకట్రావ్, డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, డా. వేదాంతం రాధేశ్యాం, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ అధికారి వాసుదేవసింగ్ తదితరులు పాల్గొన్నారు.