కృష్ణ

గ్రామదర్శినితో ప్రజా సమస్యలకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గ్రామదర్శినితో ప్రజా సమస్యలకు పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళవారం స్థానిక 1వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. 1వ వార్డులోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి రవీంద్ర స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నా ప్రజా సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి లోటు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రూ.200లు ఉన్న పెన్షన్‌ను తమ ప్రభుత్వం ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తున్నామన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 19లక్షల గృహాలు నిర్మించే లక్ష్యంతో ఒకే రోజున మూడు లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో పట్టణంలో జీ ప్లస్ 3 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అమృత పథకం కింద రిజర్వాయర్ల నిర్మాణం, నూతన పైప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వంద కోట్లతో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో పూర్తి స్థాయిలో మంచినీటిని సరఫరా చేస్తున్న ఘనత తమ పాలకవర్గానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు బత్తిన దాస్, నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలందేలా చర్యలు తీసుకోవాలి

గుడివాడ, జూలై 17: గుడివాడ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫారాలు, టెక్స్ట్‌బుక్స్ పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులను ఆర్డీవో ఎం చక్రపాణి ఆదేశించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం గుడివాడ డివిజన్, మండలస్థాయి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం తదితరాలు ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి సంరక్షించే బాధ్యతను చేపట్టాలని సూచించారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్, డివిజనల్ కోఆపరేటివ్ అధికారి కాళికాదేవి, ఇన్‌ఛార్జి డివిజినల్ పంచాయతీ అధికారి బీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.