విజయవాడ

పార్లమెంట్ హామీలకు విలువ లేదంటే ఎవరికి చెప్పుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 5: ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారతదేశం ప్రపంచ దేశాల్లోనే ఆదర్శవంతమైంది. పైగా పార్లమెంట్ అత్యున్నత దేవాలయం వంటిది. అందులో తీసుకోబోయే నిర్ణయాలు, లభించే హామీలకే విలువ లేదంటే ఈ దేశ ప్రజలు ఎవరికి మొరబెట్టుకోవాలని తెదే పార్టీ అధికార ప్రతినిధి, శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కేశినేని భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో నాటి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ రాజ్యసభలో వున్నారు.. అందులోని ఏ ఒక్క అంశంపై కూడా అభ్యంతరం పెట్టలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలని డిమాండ్ చేయగా కాదు 15 ఏళ్లు కావాలని చంద్రబాబునాయుడు కోరటం జరిగిందన్నారు. పైగా ఎన్నికల ప్రచారంలో ప్రధాన అభ్యర్థిగా పలు సభల్లో మాట్లాడిన నేటి ప్రధాని నరేంద్రమోదీ విభజన చట్టంలోని అంశాలతో పాటు పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని తుచ తప్పక అమలు చేస్తానంటూ ఐదుకోట్ల ఆంధ్రులను నమ్మించి నేడు నట్టేట ముంచడం ఎంతవరకు సబబు యని ప్రశ్నించారు. వ్యక్తులు పార్టీలు మారవచ్చు.. అధికారంలోకి ఏ పార్టీ అయినా రావచ్చు.. అయితే పార్లమెంట్ నిర్ణయాలను పక్కనబెడితే ఎలాయని ప్రశ్నించారు. బిజెపి నైతిక విలువలు కల్గిన పార్టీగా అందరూ భావిస్తుంటే నేడు ప్రత్యేక హోదాపై మాట తప్పితే ఎలాయని ప్రశ్నించారు. ఈ రోజున సాంకేతిక అవరోధాలున్నాయంటున్నారు. అసలు నీతి ఆయోగ్‌ను ఎవరు తీసుకువచ్చారు ఆ సమయంలో హామీలు గుర్తుకు రాలేదా.. పోనీ ప్రధాని దానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు ఆ మాత్రం ఈ రాష్ట్రం పట్ల చొరవ చూపలేరా యని ప్రశ్నించారు. ఈ రాష్ట్రం అడ్డగోలుగా విభజించబడింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం.. ఒక్క పరిశ్రమ లేదు, ఉపాధి కాశాలు మృగ్యం. శాసనసభ ఇప్పటికే రెండుసార్లు తీర్మానం చేసి పంపింది. ముఖ్యమంత్రి స్వయంగా 20సార్లు ఢిల్లీ వెళ్లి అభ్యర్ధించారు.. అయినా ప్రయోజనం శూన్యం. అసలు మొదటి నుంచి ఢిల్లీవారు తెలుగువారిని చిన్నచూపు చూడటం సాధారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలను పక్కనబెట్టి రాజకీయ పక్షాలన్నీ ఈ రాష్ట్ర భవితవ్యం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందంటూ బొండా పిలుపునిచ్చారు. కేంద్రంలో మంత్రి పదవులు తమకు గడ్డిపోచ వంటివి. వాజ్‌పాయ్ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి 38 మంది ఎంపిలు ఉన్నప్పటికీ మంత్రి పదవులకు దూరంగా వున్న విషయం మరువరాదన్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్నందున ఎన్‌డిఎ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాల్సి వచ్చింది మినహా మరో స్వార్ధం లేదన్నారు. విలేఖరుల సమావేశంలో సూపర్‌బజార్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, పార్టీ అధికార ప్రతినిధి కొట్టేటి హనుమంతరావు పాల్గొన్నారు.