కృష్ణ

నిర్వాశిత రైతు సంఘం నేతపై పోలీస్ జులుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మే 6: ఏలూరు కాల్వ మళ్లింపు నిర్వాశిత రైతు సంఘం నేత గూడవల్లి నర్సయ్యను గన్నవరం పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఘటన సిఎం సభలో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం చిక్కవరం బ్రహ్మయ్యలింగం చెరువు వద్ద జరిగిన సిఎం చంద్రబాబు నాయుడు సభకు నిర్వాశిత రైతులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో నిర్వాశిత రైతు సంఘం నాయకుడు నర్సయ్యను మఫ్టీలో ఉన్న పోలీసులు వచ్చి బయటికి రమ్మన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ వంశీతో మాట్లాడమని ఫోన్ చేసినా పోలీసులు వినిపించుకోలేదు. విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఏలూరు కాల్వ మెట్ట గ్రామాల్లోకి మళ్లించవద్దంటూ ఇటీవల ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు చేబట్టిన ఆందోళనలో నర్సయ్య కీలక పాత్ర వహిస్తున్నారు. సిఎం చంద్రబాబు సభలోకి వచ్చిన తర్వాత నర్సయ్య సిఎంతో ఆ విషయాన్ని ప్రస్తావిస్తారని ముందుగా పసిగట్టిన పోలీసులు ఆయన్ని బయటికి రావాలని కోరారు. తాను రానని తెల్పి ఎమ్మెల్సీ వంశీతో మాట్లాడమన్నా వినకుండా పోలీసులు అమితోత్సాహాన్ని ప్రదర్శించి పోలీస్ వాహనంలో ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.