కృష్ణ

ఈదురుగాలుల బీభత్సానికి రైతులకు అపార నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మే 6: ప్రకృతి వైపరిత్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. పంట చేతికొచ్చే దశలో శుక్రవారం ఉదయం కురిసిన అకాలవర్షం, ఈదురుగాలుల బీభత్సానికి ఉద్యానవన పంటలకు అపారనష్టం వాటిల్లింది. చెరువు మాధవరం గ్రామంలో గరికపాటి జైపాల్‌కు చెందిన పొలంలో బొప్పాయి, మునగచెట్లు నేలకూలాయి. సుమారు లక్ష రూపాయల వరకూ నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోతున్నాడు. ఇక చెవుటూరు గ్రామంలో కగ్గా వెంకటనర్సయ్య, పటాపంచుల జమలయ్య, నకుళ్ళ కొండయ్య, ఎమ్ కొండలబాబు, ఆంజనేయులు తదితర రైతులకు చెందిన మామిడితోటల్లోని కాయలన్నీ నేలరాలాయి. సుమారు 5లక్షల రూపాయల వరకూ వీరందరికీ నష్టం వాటిల్లింది. రెప్పపాటులో గాలివాన తమను నట్టేట ముంచిందని బాధిత రైతులు వాపోయారు.