కృష్ణ

డైవర్షన్ రోడ్డుపై రాకపోకలు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఆగస్టు 14: మొవ్వ మండల శివారు ఐనంపూడి డ్రెయిన్ పరవళ్లకు డైవర్షన్ రోడ్డు పటిష్టత కోల్పోవడంతో గత నాలుగు రోజులుగా వాహన రాకపోకలు నిషేధించినట్లు మొవ్వ తహశీల్దార్ బి రామానాయక్, ఎస్‌ఐ పెద్దిరెడ్డి సురేష్ తెలిపారు. సకాలంలో వంతెన నిర్మాణం పూర్తి కాకపోవటంతో ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఐనంపూడి డ్రెయిన్ గట్టుకు నీరు తాకుతోందన్నారు. వంతెన నిర్మాణం కారణంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు కట్టలు జారుతుండటం గత నాలుగు రోజులు నుండి వాహనాల రాకపోకలు మళ్లించటంతో వాహన చోదకులు అదనంగా 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో జనవరిలో ప్రారంభించాల్సిన వంతెన నిర్మాణం జూన్ నెలలో ప్రారంభించటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రెయిన్‌లో నీటి ప్రవాహం తగ్గే వరకు రాకపోకలు నిలుపుదల చేస్తామని ఎస్‌ఐ సురేష్ తెలిపారు. మంగళవారం తహశీల్దార్ బి రామానాయక్, ఎస్‌ఐ సురేష్ గండి ప్రాంతాన్ని పరిశీలించి తక్షణ చర్యలపై సిబ్బందిని ఆదేశించారు.