కృష్ణ

సహకార సంఘాలతోనే వ్యవసాయాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండవల్లి: సహకార సంఘాలతోనే వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి సాధిస్తాయని, కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని కెడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. మండవల్లిలో రూ. 70 లక్షలతో నూతనంగా నిర్మించిన సహకార సంఘం బ్యాంకును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార బ్యాంకుల్లో ఇతర కమర్షియల్ బ్యాంకుల వలే అన్ని రకాల సేవలు అందిస్తున్నామని, సహకార సంఘాల ద్వారా వ్యవసాయ రుణాలు, చేపల రైతులకు చేపల మేతల రుణాలు, అలాగే పలు కార్పొరేషన్ రుణాలు, కర్షక మిత్ర, ఎస్‌వోడి, దీర్ఘకాలిక రుణాలను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. చేపల రైతులకు గత ఏడాది రూ.1100 కోట్లు రుణాలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి చేపల రైతులకు ఎకరానికి రూ.3 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కంటే ఒక శాతం అదనంగా వడ్డి ఇస్తున్నామన్నారు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో కృష్ణా కో-ఆపరేటివ్ బ్యాంకు మొదటి స్థానంలో ఉందని, ఏడాదికి రూ. 4వేల కోట్ల మేర టర్నోవర్ దాటినట్లు ఆయన వివరించారు. అన్ని సహకార సంఘాలను కంప్యూటరీకరించామని, రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. మండవల్లిలో బ్యాంకు ఏర్పాటుకు స్థలం కొనుగోలుకు, నిర్మాణానికి రూ.1.16 కోట్లు ఖర్చు అయ్యిందని, ఈ బ్యాంకు నిర్మాణానికి విశేష కృషి చేసిన సెంట్రల్ బ్యాంకు డెరెక్టర్ మట్లపూడి నారాయణరావుకు అభినందనలు తెలుపుతూ ఆయనను పిన్నమనేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, బ్యాంకు సీఇఓ శివసుబ్రహ్మణ్యం, ఎఎంసీ ఛైర్మన్ సామర్ల శివకృష్ణ, ఎంపీపీ సాకా జెసింత, డీసీ వైస్ ఛైర్మన్ చదలవాడ శేషగిరిరావు, కైకలూరు జడ్పీటీసీ సభ్యురాలు బోమ్మనబోయిన విజయలక్ష్మీ, మాజీ జడ్పీటీసీ సభ్యులు చింతపల్లి అంకినీడు, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్ (రాము), సెంట్రల్ బ్యాంకు డెరెక్టర్లు ఆదినారాయణ చౌదరి, బుంగా బాబురావు, సూర్యనారాయణ, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.