కృష్ణ

బందరులో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు) : గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు గురువారం సాయంత్రం బందరు పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై మోకాలి లోతుకు పైగా వర్షం నీరు చేరటంతో వాహనచోదకులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ఆర్టీసీ బస్టాండ్, కోనేరుసెంటరు పూర్తిగా నీట మునిగాయి. అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నీటిలో తేలియాడుతున్నాయి. డ్రెయిన్‌లు పొంగి పొర్లటంతో ఏ రహదారి చూసినా చిధ్రంగా దర్శనమిస్తున్నాయి. సాయంత్రం 4గంటలు నుండి 5గంటల వరకు భారీ వర్షం కురవడంతో ఆ సమయంలో పాఠశాలలు, కళాశాలలు వదలటంతో విద్యార్థులు, చిన్నారులు తడిసి ముద్దయ్యారు. బ్యాగ్‌లు, పుస్తకాలు తడిసిపోయాయి. పల్లపు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, టెంపుల్ కాలనీ, ఎస్టీ కాలనీ, నారాయణపురం, శివగంగ, కాలేఖాన్‌పేట, డ్రైవర్స్ కాలనీ, రైల్వే స్టేషన్ నీట మునిగాయి.