కృష్ణ

వాజపేయి మృతితో దివిసీమలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి మృతి చెందారన్న సమాచారం దివిసీమ ప్రజల్లో తీవ్ర విషాధాన్ని నింపింది. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న వాజపేయి విద్యార్థి దశ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్) కార్యకర్త స్థాయి నుంచి వివిధ బాధ్యతలను నిర్వర్తించారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కూడా ఆయన తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆ క్రమంలో దేశంలో కాంగ్రెసేతర పక్షాల పునర్వవస్థీకరణ సమయంలో ఆవిర్భవించిన జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన తొలి కాంగ్రేసేతర ప్రభుత్వంలో వాజపేయి విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమలో సంభవించిన పెను తుఫాన్, ఉప్పెన ఉదంతంలో ఈ ప్రాంతంలోని తీర గ్రామాలన్నీ నీట మునిగి 10వేల మందికి పైగా మృత్యువాతకు గురయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు నేతృత్వంలో బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ క్రమంలో విశ్వవ్యాప్తంగా ఉన్న 200 స్వచ్ఛంద సంస్థలు మండలి పర్యవేక్షణలో బాధిత గ్రామాల పునః నిర్మాణానికి కంకణం కట్టుకున్నాయి. అందులో భాగంగానే నాగాయలంక మండలంలోని పర్రచివర శివారు దినదయాళ్‌పురం (మూలపాలెం) గ్రామాన్ని ఆర్‌ఎస్‌ఎస్ పునః నిర్మించింది. ఈ గ్రామ పున నిర్మాణ సమయంలో అటల్ బిహారీ వాజపేయితో పాటు నానాజీదేశ్‌ముఖ్, మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడు ప్రభాకర్‌జీతో పాటు పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన శ్రేణులు పాల్గొన్నారు. ఈ గ్రామం పునః నిర్మాణ పనులు పూర్తయిన తదుపరి అప్పటి వరకు మూలపాలెంగా పిలువబడుతున్న ఈ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం దీనదయాళ్‌పురంగా నామకరణం చేసింది. ఈ గ్రామాన్ని అప్పటి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. ఆ తదుపరి ఈ గ్రామాన్ని అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, గవర్నర్ శారదా ముఖర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు సందర్శించారు. వాజపేయితో అనుబంధం కలిగిన వారిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రముఖులు భాగయ్య, దీనదయాళ్ వైద్య కేంద్రానికి అధికారిగా పని చేసిన డా. శాస్ర్తీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు భోగాది వెంకటేశ్వరరావు, మండవ పిచ్చియ్య, దివంగత శనగవరపు వెంకటేశ్వర్లు, దివంగత కొక్కిలిగడ్డ మస్తాన్‌రావ్ తదితరులు ఉన్నారు.