కృష్ణ

బడుగుల ఆశాజ్యోతి ‘గౌతు లచ్చన్న’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్ధార్ గౌతు లచ్చన్న అని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సర్ధార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమాన్ని గురువారం స్థానిక బస్టాండ్ సెంటరులో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రవీంద్ర లచ్చన్న విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న అహర్నిశలు శ్రమించారన్నారు. అటువంటి లచ్చన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్దార్ గౌతు లచ్చన్న ఆశయ సాధన కమిటీ ప్రతినిధి, బీసీ నాయకుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మరకాని పరబ్రహ్మం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, బీజేపీ బందరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పంతం వెంకట గజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.