కృష్ణ

మంత్రి రవీంద్రకు తప్పిన ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 6: రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి రవీంద్ర గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంత్రి రవీంద్ర ప్రయాణిస్తున్న ఎపి 16సిఎం 9999 నెంబరు గల వాహనం కాజ టోల్‌గేట్ దాటిన తర్వాత అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అయితే అదృష్టవశాత్తు మంత్రి రవీంద్రతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కారు మాత్రం నుజ్జు నుజ్జయింది. మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే హైవే పోలీసులు మంత్రి రవీంద్రను కారులో ఉన్న ఐదుగురిని హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి రవీంద్ర సీటు బెల్టు పెట్టుకుని నిద్రపోతున్నారు. సీటు బెల్టు పెట్టుకోవటంతో కారు బోల్తా పడిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయి ప్రాణాలను రక్షించాయి. డ్రైవర్ వెంకట్ తలకు కొద్దిపాటి బలమైన గాయమైంది. తెలుగు యువత కార్యదర్శి కుర్రా నరేంద్ర మోకాలుకు చిన్న ఫ్యాక్చర్ కావటంతో రెండు కుట్లు పడ్డాయి. మంత్రి రవీంద్ర అసిస్టెంట్ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్, పిఆర్‌ఓ భాషా, గన్‌మెన్ పార్ధులకు కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. వీరికి మణిపాల్ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించి శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వెంటనే మంత్రి రవీంద్ర మచిలీపట్నం చేరుకున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న బందరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉలికి పడ్డారు. మంత్రి రవీంద్రకు ఎలా ఉందనే విషయమై ఫోన్‌లలో అరా తీశారు. మంత్రి ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకుని ఆయన రాక కోసం ఎదురు చూశారు. మంత్రి రవీంద్ర సుల్తానగరం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని వందలాది మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా 12గంటల సమయంలో తన నివాసానికి చేరుకున్నారు. కొత్త మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పూజారి తోట సత్యనారాయణ మంత్రి రవీంద్రకు పలు రకాల దిష్టి తీశారు. రవీంద్ర కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు గురై మంత్రిని అలింగనం చేసుకున్నారు. మంత్రి రవీంద్ర అక్క, బావ నడకుదిటి నరసింహారావు, శేషమల్లేశ్వరి, భార్య నీలిమ ఇతర కుటుంబ సభ్యులు మంత్రి రవీంద్రను అప్యాయంగా అక్కున చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్ తదితరులు మంత్రి రవీంద్రను పరామర్శించారు.
క్షణం తీరిక లేకుండా మూడు జిల్లాల్లో పర్యటన
ప్రమాదం జరిగిన రోజున మంత్రి రవీంద్ర క్షణం తీరిక లేకుండా గడిపారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఉదయం 7గంటలకు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతిలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఆర్‌పి ధరలను ఖచ్చితంగా అమలు చేయాలని, రాష్ట్రాన్ని సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటూ అధికారులను ఆదేశించారు. తిరుపతి బైరాఘ పట్టాడ బిసి సంక్షేమ హాస్టల్‌లో కోటి రూపాయలు విలువ చేసే రుణాలను అందజేశారు. నెల్లూరు జిల్లా పెళ్ళకూరు మండలం కొత్తూరులో ఇంకుడు గుంటలు, నీటి కుంటలపై అవగాహనా సదస్సులో పాల్గొన్నారు. రాత్రి 10.30ని.లకు రామదూత స్వామీజీని దర్శించుకున్నారు. ఆ తర్వాత కావలిలో ఇటీవల వివాహం చేసుకున్న తన బంధువులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళారు. రోజంతా క్షణం తీరిక లేకుండా మంత్రి పర్యటన సాగినా ఒక్క నిమిషం కూడా సేద తీరకుండా విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మంత్రి రవీంద్ర కారు డ్రైవర్ వెంకట్ ఒత్తిడికి గురి కావటంతో కారు నడుపుతున్న సమయంలో కునుకు రావటంతో కారు అదుపు తప్పినట్టు తెలుస్తోంది.