కృష్ణ

రాజనీతిజ్ఞుడు వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): గొప్ప విలువలతో కూడిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారి వాజపేయి అని రాష్ట్ర న్యాయ, యువజన సంక్షేమం, క్రీడా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక కోనేరుసెంటరులో భారత మాజీ ప్రధాని దివంగత వాజపేయి సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ వాజపేయి మృతితో దేశం గొప్ప దూర దృష్టి గల నాయకుడిని కోల్పోయిందన్నారు. అతి చిన్న వయస్సులో రాజకీయాలలోకి వచ్చి అనేక సార్లు పార్లమెంటీరియన్‌గా చక్కని ఆశయాలతో హుందాగా వ్యవహరించిన రాజకీయవేత్త అని కొనియాడారు. రాష్ట్భ్రావృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతగానో సహకరించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, కౌన్సిలర్ నారగాని ఆంజనేయ ప్రసాద్, బీజెపీ నాయకులు పంతం గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.