కృష్ణ

అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు సుపరిపాలన అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబ్బీపేట: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5నుండి 25వరకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల కు శిక్షణలో భాగంగా, గ్రామాల్లో అబివృద్ధి పనులు చేయడంతో పాటు పా టు ప్రజలకు సుపరిపాలన అందించాలని గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులను జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ఆదేశించారు. రాష్ట్రంలో జిల్లాలో మొదటి గా ఈ శిక్షణ ఏర్పాటు చేశామని తెలిపా రు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం విజయవాడ, నూజివుడు డివిజన్లలోని గ్రామ పంచాయితీ ప్రత్యేధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకాధికారులకు అన్ని రకాల అధికారా లు కల్పించిందని, ఈ దిశగా అబివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో చేపట్టవలసిన అబివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో తీర్మానం ఆమోదింపజేయాలని కలెక్టర్ ప్రత్యేకాధికారులను ఆదేశించా రు. ఆనంతరం ఆయా గ్రామాల్లో రో డ్లు, డ్రైన్ల, అబివృద్ధికి సంబంధించి పనులు చేపట్టి ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపర్చాలని కలెక్టర్ ఆదేశించారు. వారంలో గురు, శుక్ర వారాల్లో గ్రామా ల్లో గ్రామదర్శిని నిర్వహించి గ్రామదర్శనిలో ప్రజల నుండి అందిన ఫిర్యాధు లు, కార్యాచరణ ప్రణాళిక అమలుకు సంబంధించి వివరాలను టెలిగ్రామ్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. అ భ్యున్నతి పథకం అమలు ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆదాయం అందే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఈ పథకం లబ్ధిదారుల వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పదర్శించాలని కలెక్టర్ అన్నారు. విభిన్న ప్రతిభవంతులకు చేయూత కార్యక్రమం ద్వారా అందిస్తున్న లబ్ధి గ్రామాల్లోని అర్హులైన ప్రతి లబ్ధిదారుకి అందే విధంగా పంచాయతీ సెక్రటరీ, ప్రత్యేకాధికారులు పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పడు డ్రైన్లలో పూడికతీయటం, రోడ్లపై చెత్త తొలగించటం మొదలైన పనులు నిరంతరం కొనసాగాలని ఆయన అన్నారు. గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సీసీ రోడ్ల రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో 970 గ్రామ పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, జిల్లాలో 3 వేల మంది గ్రీన్ అంబాసిడర్లను చేయాలని లక్ష్యం కాగా, ఇంతవరకు 2,400 మందిని ఏర్పాటు చేశామని, మిగిలిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించటం ద్వారా గ్రీన్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ, విఆర్వో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు పెంచాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ 2 బాబూరావు మాట్లాడుతూ విజయవాడ, నూజీవీడు డివిజన్లలోని గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులకు ఈ శిక్షణ కార్యక్రమం ఎంతగానో దోహాదపడుతుందని, స్థానిక సంస్థలను ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలుగా భావించి ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని, వీటి ద్వారా గ్రామాల్లో వౌలిక సదుపాయాల అబివృద్ధికి ప్రతి స్పెషల్ ఆఫీసర్ కృషి చేయాలని అన్నారు. ఆనంతరం విజయవాడ డివిజనల్ పంచాయతీ అధికారి కెపి చంద్రశేఖర్ రచించిన, కరదీపిక, పుస్తకాన్ని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ శిభిరంలో రిసోర్సు పర్సన్ ప్రభాకర్, జెసి 2 పి బాబూరావు, జిల్లాపరిషత్ సిఇవో షేక్ సలాం, డిఆర్వో లావణ్యవేణి, పంచాయితీరాజ్ ఎస్‌ఇ శివకుమార్ ఐసిడిఎస్ పిడి కృష్ణకుమారి, ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.