కృష్ణ

కర్బలా అమరులకు రుధిర తర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 21: మొహర్రం దుఖః దినాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో ముస్లింలు రక్తం చిందించారు. ఇస్లాం మత పరిరక్షణ కోసం కర్బలా మైదానంలో మహమ్మద్ ప్రవక్త మనువడు ఇమాం హుస్సేన్, ఆయన అనుయాయులు చేసిన ప్రాణ త్యాగాన్ని స్మరించుకుంటూ కత్తులు, బ్లేడ్లతో గుండెలను బాదుకున్నారు. పది రోజుల పాటు మొహర్రం దుఖ దినాలను పాటించిన ముస్లింలు శుక్రవారం కోనేరుసెంటరులో మాతాం (చెస్ట్ బీటింగ్) నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీ తర్వాత మచిలీపట్నంలో చెస్ట్ బీటింగ్ నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. చిన్న పార్టీ, పెద్ద పార్టీల ఆధ్వర్యంలో ఈ చెస్ట్ బీటింగ్ నిర్వహిస్తున్నారు. తొలుత గిరేహి-ఎ-హుజ్జత్ (చిన్న పార్టీ) చెస్ట్ బీటింగ్ నిర్వహించారు. అనంతరం గిరోహే-ఎ-మీరేన్‌షా (పెద్ద పార్టీ) వారు చెస్ట్ బీటింగ్‌లో పాల్గొన్నారు. చిన్న పార్టీ మీర్జా ఫర్ అలీ నేతృత్వంలో బారహ్ ఇమామ్ పంజా నుండి చింతచెట్టు సెంటరు, రాజుపేట మీదుగా కోనేరుసెంటరు వరకు ప్రదర్శనగా వచ్చి చెస్ట్ బీటింగ్‌లో పాల్గొన్నారు. తర్వాత పెద్ద పార్టీ వారు జామియా మసీదు నుండి ప్రదర్శనగా బయలుదేరి జవ్వారుపేట, రాజాగారి సెంటరు మీదుగా కోనేరుసెంటరుకు చేరుకుని చెస్ట్‌బీటింగ్ నిర్వహించారు. చెస్ట్ బీటింగ్‌లో పాల్గొని రక్తపు గాయాలైన వారికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య తదితరులు సపర్యలు చేశారు.