కృష్ణ

ఘనంగా అంకమ్మతల్లి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, మే 8: మండలంలోని గరికపర్రులో వీరంకి వంశీయుల ఇలవేల్పు అంకమ్మతల్లి సంబరాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వీరంకి వంశీయులు అంకమ్మతల్లి సంబరాలకు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా ఆలయం వద్ద 5వేల మందికి అన్నసంతర్పణ జరిగింది. జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, ఫకిర్‌చంద్ర గౌడ్, వీరంకి శరాబంది, వీరంకి శోభనాద్రి, నూజివీడు ట్రిపుల్ ఐటి డైరెక్టర్ వీరంకి వెంకటదాసు, చిరంజీవి, సుబ్బారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఘనంగా మహిసమ్మ తల్లి సంబరాలు
మండలంలోని పెనమకూరు గ్రామంలో వేంచేసి ఉన్న మరీదు వంశీయుల ఇలవేల్పు మహిసమ్మ తల్లి సంబరాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మహిసమ్మ అమ్మవారికి మరీదు వంశీయులు ఉదయం బందరు కాలువ వద్ద స్నానమాచరింపచేసి గ్రామంలో మధ్యాహ్నం వరకు అన్ని వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం అమ్మవారిని ఆలయానికి చేర్చగా వందలాదిగా తరలి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనేక గ్రామాల నుంచి మరీదు వంశీయులు మహిసమ్మ తల్లి సంబరాలకు తరలివచ్చారు.