కృష్ణ

రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, సెప్టెంబర్ 21: నూజివీడు నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి 9.87 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేటాయించారని నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు చెప్పారు. స్ధానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. నూజివీడు మండలం తుక్కులూరుకు 1.60 కోట్ల రూపాయలు, సుంకొల్లుకు 67.50 లక్షల రూపాయలు, ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి 76.50 లక్షల రూపాయలు, సూరేపల్లి గ్రామానికి 54 లక్షల రూపాయలు, వేల్పుచర్ల గ్రామానికి 72 లక్షల రూపాయలు, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట పంచాయతీకి 2.70 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన వివరించారు.

ప్రజా సంక్షేమమే వైసీపీ లక్ష్యం

బంటుమిల్లి, సెప్టెంబర్ 21: పేదల సంక్షేమం కోసం రానున్న ఎన్నికల్లో వైసీపీకి అధికారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ విజ్ఞప్తి చేశారు. గడప గడపకీ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బంటుమిల్లిలో ఆయన పర్యటించారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. వైసీపీ బంటుమిల్లి మండల కన్వీనర్ మల్లిశెట్టి రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.