కృష్ణ

నడక ఆరోగ్యానికి మంచిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి మరో 30వేల కిలో మీటర్లు నడిచినా సీఎం మాత్రం కాలేడని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జగన్ 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏదో విజయం సాధించేసారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసం పోగొట్టుకున్న జగన్ 3వేల కిలోమీటర్లు నడిచినా 30వేల కిలో మీటర్లు నడిచినా ఒకటేనన్నారు. జగన్ చేస్తున్నది అసలు పాదయాత్రే కాదన్నారు. మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్ మాదిరి ఉదయం మూడు గంటలు, సాయంత్రం మరో మూడు గంటలు జగన్ నడుస్తూ పాదయాత్రలకు ఉన్న పరువు తీస్తున్నారని విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో నిండా మునిగి వారం వారం కోర్టు మెట్లు ఎక్కే జగన్‌ను ప్రజలెవ్వరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కొంగ జపాలు, దొంగయాత్రలతో జగన్ కాలం వెళ్లదీస్తున్నాడే తప్ప ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే అధికారాన్ని కట్టబెడతాయని మంత్రి పేర్కొన్నారు.

పేదరికం లేని సమాజం లక్ష్యం

* సాధికార మిత్రల సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, సెప్టెంబర్ 25: పేదరికం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సాధికార మిత్ర, బీమా మిత్ర, కల్యాణ మిత్ర, బీమా మిత్ర, మహిళా సమాఖ్య సభ్యులతో మంత్రి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కనీసం రూ.10వేలు ఆదాయం పొందేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు రూపొందిస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయి వరకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో సాధికార, కల్యాణ, బీమా మిత్రలను ఏర్పాటు చేసిందన్నారు. పెన్షన్, రేషన్ సమస్య ఎక్కడా లేకుండా ప్రజల్లో సంతృప్తి స్థాయి మరింత పెరిగేలా పని చేయాలన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో దేశంలోనే మన రాష్ట్రంలో 64వ స్థానంలో ఉందన్నారు. దీన్ని మొదటి పది స్థానాల్లోకి తీసుకు వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. బందరు నియోజకవర్గంలో సంతృప్తి స్థాయి 74 శాతం ఉందన్నారు. రేషన్ పంపిణీ పట్ల ప్రజల్లో సంతృప్తి తక్కువగా ఉందని, దీన్ని సమీక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పట్టణంలో రూ.100కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కింద రూ.22కోట్లతో జరుగుతున్న ఫిల్టర్ బెడ్స్ నిర్మాణాలు పూర్తయితే మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు గిలకలదిండిలో 20 ఎకరాలు స్థలాన్ని గుర్తించామన్నారు. మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర వేసేందుకు సాధికార మిత్రలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా భాగస్వామ్యంతో సమస్యలకు చెక్

* సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టీకరణ

జగ్గయ్యపేట/జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 25: సమస్యల పరిష్కారం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల భాగస్వామ్యంతోనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో జియాలజిస్ట్ ధరణికోట వెంకట రమణ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ ప్రజా అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. మండలంలోని షేర్‌మహమ్మద్‌పేట మోడల్‌కాలనీలో ఫ్లోరైడ్ బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. యువతరం ఆదివారం నాడు శ్రమదానం ద్వారా వారి పరిసరాలను బాగు చేసుకోవడంతో పాటు స్థానికులకు అవగాహన కల్పించాలని, ఆధునిక పరిజ్ఞానాన్ని వినోదం కోసం విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. వాట్స్‌ఆప్, ఫేస్‌బుక్, సినిమాలు, సీరియల్స్, బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని, యువత ఇప్పటికైనా మేల్కొని వాటి నుండి బయటపడి మంచి భారతదేశం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయని, వాటి ద్వారా వచ్చే కాలుష్యం నివారించే బాధ్యత ఆ పరిశ్రమల యాజమాన్యంపై ఉందని గుర్తు చేశారు. కర్మాగారాలు నిర్మాణం చేసినప్పుడే ప్రత్యేకంగా సీసీఆర్ నిధులను ఏర్పాటు చేయాల్సి ఉందని, కర్మాగారాల సమీపంలోని గ్రామాల అభివృద్ధికి వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కొద్ది నెలల్లోనే ఎన్నికలు వస్తాయని, డబ్బులు పెట్టి ఓట్లు కొని అధికారంలోకి వచ్చే నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోరని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి రెట్టింపు సంపాదించుకోవడానికే వారు చూస్తారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానికంగా చెరువులో పేరుకుపోయిన తూటికాడను ఏ విధంగా తొలగించాలో తెలుసుకోవాలని, ఆరు నెలల్లో ఆ కార్యక్రమాన్ని బాగు చేసే బాధ్యత వేదికపై ఉన్నవారు తీసుకోవాలని సూచించారు. జగ్గయ్యపేట ప్రాంతంలోని కాలుష్య, ఫ్లోరైడ్ సమస్యలను తాను సమావేశానికి వచ్చే ముందే జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం దృష్టికి తీసుకువెళ్లి చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.