కృష్ణ

ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా సస్యశ్యామలమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, మే 8: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమైతే కృష్ణా డెల్టా సస్యశ్యామలం కావటం ఖాయమని ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలోని మంచినీటి రిజర్వాయర్ ఆవరణలో ఇంకుడు గుంట పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. భూగర్భ జలాలను పెంపొందించుకోడానికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందుకోసం నివాస గృహాలలో కూడా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేస్తాన్నామన్నారు. ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగుతుందన్నారు. భావి తరాలకు భూగర్భ జలాలు సమృద్ధిగా అందాలంటే నీటిని పొదుపుగా వాడుకోడంతో పాటు వర్షపు నీరు భూమిలో ఇంకే విధంగా శాస్ర్తియమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తొలుత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖయూమ్, పట్టణ టిడిపి అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, ప్రధాన కార్యదర్శి వాహబ్‌ఖాన్, కౌన్సిలర్లు బూసం ఆనందరావు, బెజవాడ నాగరాజు, గరికముక్కు చంద్రబాబు, హమిదుల్లా, కమీషన్ ఎం గోపాలరావు పాల్గొన్నారు.