కృష్ణ

వాస్తవ దృక్పథం, ఆలోచన శక్తి పెంపొందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 8: మనిషి సుఖం కోసం చూడకుండా సంతోషంతో జీవిత గమనాన్ని పెంపొందించుకోవాలని జనవిజ్ఞాన వేదిక జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డా. వి బ్రహ్మారెడ్డి అన్నారు. మొవ్వ మండల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు ఆదివారంతో ముగిశాయి. స్థానిక డా. వెలివోలు పేర్నీడు ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపా కృష్ణకిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లు రోగాలకు కారణమన్నారు. నిరంతర అధ్యయనం ద్వారా సమస్యలకు సమగ్ర పరిష్కారం లభిస్తుందన్నారు. నిరంతర అధ్యయనం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఊహాజనిత ప్రశ్నలతో విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. బావిభారత పౌరుల్లో జాతీయ దృక్పథాన్ని, ఆలోచనా శక్తిని పెంచాలన్నారు. ప్రచారాల్లోని వాస్తవాలను గుర్తించేలా ప్రజలను చైతన్యపర్చటమే జన విజ్ఞాన వేదిక ముఖ్యోద్దేశమని ఆయన వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పాగోలు రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జంపాన కృష్ణకిషోర్, జిల్లా అధ్యక్షులు పాగోలు రవిప్రసాద్, కార్యదర్శి ఎన్ బుచ్చియ్యబాబు, రాష్ట్ర సభ్యులు జి శ్రీనివాస్ పాల్గొన్నారు.