కృష్ణ

మహిళలు అక్షర శిల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు: చదువుకున్న మహిళల వల్ల కుటుంబంలో అందరూ విద్యావంతులు అవుతారని వెలుగు ఏపీఎం ఎ చంద్రవౌళి అన్నారు. బుధవారం కోడూరు స్ర్తి శక్తి భవనంలో స్థానిక గ్రంథాలయాధికారిణి పుష్పలత మహిళలకు నిర్వహించిన వ్యాసరచన పోటీలను ఆయన పర్యవేక్షించారు. మహిళలు అక్షర శిల్పులు అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో కోడూరుకు చెందిన జి వెంకట లక్ష్మి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఆమెను కోడూరు మండలం నుండి విజయవాడలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు పంపుతున్నట్లు గ్రంథాలయాధికారిణి తెలిపారు.
రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ‘ఎస్‌విఎల్’ విద్యార్థులు
అవనిగడ్డ, అక్టోబర్ 10: స్థానిక ఎస్‌వీఎల్ క్రాంతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇటీవల సిద్దార్ధ మహిళ కళాశాలలో నిర్వహించిన 19 సంవత్సరాల లోపు టెన్నికాయిట్ జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించగా ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో చాట్రగడ్డ శివలక్ష్మణసాయి, కన్నా మహేష్, బాలికల జట్టులో మోపిదేవి ఫణిలక్ష్మి, దాసి అంజిత ఎంపికయ్యారు. వీరు ఈ నెల 11 నుండి మూడు రోజులు పాటు చిత్తూరు జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి టెన్నీకాయిట్ పోటీల్లో పాల్గొంటారు. ఈ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ ఉమామహేశ్వరరావు, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, పీఇటీ గాజుల శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.