కృష్ణ

దివిసీమలో కీచకపర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/అవనిగడ్డ: మహాత్మ గాంధి నడయాడిన దివిసీమలో కీచక పర్వం చోటు చేసుకుంది. తండ్రికి మించిన భరోసా, గురువును మించిన దైవం లేదు అన్న పదాలకే మాయని మచ్చలా ఓ ప్రబుద్ధుడు ప్రవర్తించిన తీరు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఆ ప్రబుద్ధుడు మానవత్వాన్ని మరచి తన నాలుగేళ్ల కుమార్తె పట్ల మృగంలా మారాడు. రక్తం పంచుకుని పుట్టిన కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఘటన అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని చిన్నారి తన తండ్రి చర్యలను ఎవరికీ చెప్పుకోలేక తండ్రి చేసిన గాయాన్ని భరించలేక గత ఐదు రోజులుగా చిత్ర హింసలకు గురైంది. కళ్ల ముందు కుమార్తె పడుతున్న బాధను గమనించిన తల్లి వైద్యుడు చెప్పిన విషయానికి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికను ఆమె పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మోదుమూడి గ్రామానికి చెందిన శిర్విశెట్టి కోటి నాగేశ్వరరావు కైకలూరు మండలం వింజరం గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. నాగేశ్వరరావు-మారుతీప్రసాదం దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడితో పాటు నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. నాగేశ్వరరావు చెడు వ్యసనాలతో పాటు మరికొంత మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న కారణంగా గత మూడు సంవత్సరాలుగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కొడుకు, కుమార్తె తల్లి వద్దనే ఉంటున్నారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా నాగేశ్వరరావు తన కుమార్తె స్కూల్‌కు వెళుతున్న సమయంలో ఒంటరిగా కలుస్తున్నాడు. గత మూడు నాలుగు రోజులుగా చిన్నారి తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతోంది. మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన బాధకు గురవుతోంది. దీన్ని గమనించిన తల్లి వేడి చేసిందేమోనని భావనతో కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి చలువ చేసే ద్రవ పదార్థాలను అందిస్తూ వచ్చింది. ఎంతకీ తగ్గకపోవటంతో అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడి వద్దకు తీసుకువెళ్లగా అసలు విషయం బయట పడింది. చిన్నారి మర్మాంగం వద్ద గాయం ఏర్పడిందని, ఎవరో అత్యాచారయత్నానికి పాల్పడినట్లు వైద్యుడు చెప్పటంతో ఆ తల్లి ఖంగు తిని విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై చిన్నారిని ప్రశ్నించగా తన తండ్రే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపింది. దీంతో చిన్నారిని మెరుగైన వైద్యం నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం, ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు తెలిపారు.