కృష్ణ

సినీఫక్కీలో 45వేలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, మే 10: స్థానిక 14వ వార్డుకు చెందిన బి.టెక్ విద్యార్థి నవీన్ మంగళవారం స్థానిక స్టేట్ బ్యాంక్‌లో రూ.45వేలు జమ చేసేందుకు వెళ్లగా సినీఫక్కీలో చోరీ జరిగింది. బ్యాంక్ వద్ద ఉన్న ఒక వ్యక్తి తాను జమ చేస్తానని చెప్పటంతో ఆ సొమ్మును నవీన్ అపరిచితుడి చేతిలో పెట్టాడు. తర్వాత నవీన్ పని మీద పక్క కౌంటర్‌కు వెళ్లటంతో అపరిచితుడు అదృశ్యమయ్యాడు. లబోదిబోమన్న నవీన్ ఎంత వెతికినా అపరచితుడు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఎస్‌ఐ గణేష్ రంగప్రవేశం చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కృష్ణమాదిగ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు
మైలవరం, మే 10: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఢిల్లీలో చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా మైలవరం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రిలే దీక్షలు ప్రారంభించారు. స్థానిక దళిత చైతన్య వేదిక వద్ద ఎమ్మార్పీఎస్ యువసేన అధ్యక్షులు ఇంకొల్లు జమలయ్య మాదిగ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జమలయ్య మాదిగ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకూ తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. దీక్షల్లో మరియదాసు, నరశింహారావు, వినోద్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్‌ను కొనసాగించాలని ఆందోళన
మైలవరం, మే 10: మూడేళ్లుగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వరకాల రాజాను కొనసాగించాలని కోరుతూ మండలంలోని వెల్వడం గ్రామానికి చెందిన దళితులు మంగళవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఫీల్డ్ అసిస్టెంట్ రాజాను తొలగించాలని జన్మభూమి కమిటీ సభ్యులు గతంలో ఎంపిడిఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపిడిఓ ఉన్నతాధికారులకు నివేదిక అందించగా, విషయం తెలుసుకున్న దళితులు మంగళవారం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. రాజాను కొనసాగించాలని వారు మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. ఒకదశలో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఎంపిడిఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిడిఓ హరిహరనాథ్ స్పందించి రాజాను కొనసాగించే విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని, నిబంధనల ప్రకారం జన్మభూమి కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. ఒక దశలో ఆందోళనకు కారణమైన ఒక నేత దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. మండుటెండలో ఆందోళనకు దిగటంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, ఎంపిడిఓ చర్చలతో ఆందోళన విరమించారు.

చిత్రపటాల వివాదంపై విచారణ
తోట్లవల్లూరు, మే 10: తోట్లవల్లూరు మండల పరిషత్ సమావేశపు హాలులో మాజీ మంత్రి, జిల్లా వైసిపి నేత కె పార్థసారథి చిత్రపటం తొలగింపు వివాదంపై మంగళవారం డెడ్పీ డెప్యూటీ సిఇవో ఎ నాగమహేశ్వరరావు విచారణ నిర్వహించారు. ఉదయం 10 గంటలకే ఆయన మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికి ఉద్యోగులు ఎవరూ రాకపోవటంతో వచ్చే వరకు కార్యాలయంలోనే ఉన్నారు. ఇంతలో సమాచారం తెలుసుకున్న ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి డెప్యూటీ సీఈఓని కలుసుకుని 4వ తేదీ నుంచి నెలకొన్న పరిస్థితులను వివరించారు. అనంతరం సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సిబ్బంది చేరుకున్నారు. సూపరింటెండెంట్ నుంచి తగిన సమాచారం తెలుసుకున్నారు. 9న నిర్వహించిన అత్యవసర సమావేశంలో చేసిన తీర్మానాలపై నాగమహేశ్వరరావు ఆరాతీశారు. ముందుగా రిజిస్టర్లను పరిశీలించారు. ఈ తీర్మానాల నకళ్లను సూపరింటెండెంట్ నుంచి ఆయన తీసుకున్నారు. సమావేశపు హాలులోని పార్థసారథి, దివంగత సీఎం వైస్ రాజశేఖరరెడ్డి, దివంగత ఎమ్మెల్యే అనే్న బాబురావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలను పరిశీలించి స్మార్ట్ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలోని అన్ని గదులను పరిశీలించారు. ఈసందర్భంగా నాగమహేశ్వరరావు మాట్లాడుతూ సిఇవో ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు చెప్పారు. అన్ని వివరాలను సిఇవోకు అందజేస్తామని వివరించా