కృష్ణ

నేడు దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాల సమర్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న మీడియాపాయింట్‌లో శనివారం ఉదయం ఆయన మాట్లాడుతూ దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం సంప్రదాయంగా వస్తోందన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆలయాధికారులు విస్తుృతస్థాయిలో ఏర్పాటు చేయటంతో భక్తులకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులులేకుండా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్లు మంత్రి వివరించారు. గత సంవత్సరం కంటే ఈసంవత్సరం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది శనివారం ఉదయానే్న ఇంద్రకీలాద్రికి వచ్చి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

18న కూచిపూడికి సీఎం

కూచిపూడి: నాట్య క్షేత్రం కూచిపూడిలో సిలికానాంధ్ర వసుదైక కుటుంబం, దాతల సహకారంతో రూ.67కోట్లతో నిర్మిస్తున్న సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18వతేదీన కూచిపూడి రానున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రాకను పురస్కరించుకుని శనివారం బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కర్, తహశీల్దార్ బి రామానాయక్ హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. పెడసనగల్లు రోడ్డులోని ఒక ప్రాంతాన్ని, మొవ్వ రోడ్డులోని మరో ప్రాంతాన్ని హెలిప్యాడ్ ఏర్పాటు కోసం గుర్తించారు. కాగా తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆస్పత్రి భవనం 18వతేదీ మధ్యాహ్నం 12గంటలకు సీఎం ప్రారంభిస్తారని సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు.

మోదీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు
బెదిరేది లేదు: ఎమ్మెల్సీ బచ్చుల

మచిలీపట్నం, అక్టోబర్ 13: ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు బెదిరేది లేదని శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్రం అవలంభిస్తున్న చర్యలపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో నిరసన గళం విప్పిన టీడీపీ ఎంపీలను టార్గెట్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ వారి నివాసాలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సీఐడీ, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను సైతం ప్రధాని మోదీ తన గుప్పిట్లోకి తీసుకున్నారన్నారు. ఆయా సంస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని సైతం మోదీ హరించేస్తున్నాడని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. కేవలం ఏపీలో తెలుగుదేశం పార్టీని చిన్నాభిన్నం చేయాలనే ఒకేఒక్క రాజకీయ దురుద్దేశంతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నీతి నిజాయతీ కోల్పోయాడని విమర్శించారు. నీతిమంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్కసు వెళ్లగక్కేందుకు రాష్ట్రంపై ఐటీ దాడులు చేయించి భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారన్నారు. కేవలం మరో ఐదారు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ దాడులు చేయించడం టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలని కాదా అని ప్రశ్నించారు. గతంలో మోదీ తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇదే తరహా చర్యలకు పాల్పడి ప్రజల నుండి తీవ్ర పరాజయాన్ని చవిచూశారన్నారు. అదే పరిస్థితి 2019 ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందన్నారు. మోదీ దుశ్చర్యలకు భయపడేది లేదన్నారు. రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ ముందుకు వెళుతుందని అర్జునుడు స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు వేమూరి రామకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా ఆర్గనైజర్ పీవీ ఫణికుమార్ పాల్గొన్నారు.