కృష్ణ

హోదా కోసం గళమెత్తింది జనసేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): హోదాతో ఏం వస్తుంది? హోదాతో ఒరిగేదేం లేదు.. హోదా అంటే జైలుకే అన్నది నాడు చంద్రబాబేనని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ విమర్శించారు. ఏపీకి అత్యంత ముఖ్యమైన, అవసరమైన ప్రత్యేక హోదా కోసం నాటి నుండి నేటివరకు గళమెత్తుతున్నది రాష్ట్రంలో జనసేన పార్టీ మాత్రమేననన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు రోజుకో మాట మార్చుతున్నారని విమర్శిస్తూ పవన్‌కళ్యాణ్ ఆదివారం ట్విట్టర్‌లో పలు సందర్భాలను గుర్తుచేస్తూ మీడియా క్లిప్పింగులను ట్యాగ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం మొదటిగా మాట్లాడింది జనసేన పార్టీయేనని అన్నారు. హోదాను ప్రశ్నిస్తే హోదాతో ఏం వస్తుందని నాడు చంద్రబాబు ప్రశ్నించారని గుర్తుచేశారు. హోదా అంటే జైలుకు పంపిస్తానని కూడా హెచ్చరించారన్నారు. రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా బాబు హోదా అడగనే లేదని ప్రకటించిన విష యం ప్రజలు మర్చిపోలేదన్నారు. హోదా కోసం రోజుకో మాట చెబుతున్న చంద్రబాబు వైఖరితో రాష్ట్ర ప్రజలు గందరగోళంలో పడ్డారన్నారు. హోదా అంశం మరుగున పడేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని పవన్‌కళ్యాణ్ ధ్వజమెత్తారు.