కృష్ణ

అలరించిన ‘అమ్మ’ అలంకారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ఆలయాలలో అమ్మవార్లకు చేసిన అలంకారాలు భక్తులను అలరించాయి. రాబర్ట్‌సన్‌పేట శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ అన్నపూర్ణాదేవిగా, శ్రీ కన్యకాపరమేశ్వరిని శ్రీ ధాన్యలక్ష్మిగా అలంకరించారు. ఆజాద్ రోడ్డులోని గీతా మందిరంలో శ్రీ వాసవీమాత శ్రీ సరస్వతీదేవిగా, శ్రీ లలితాదేవి శ్రీ విద్యాలక్ష్మీగా దర్శనమిచ్చారు. కాగా త్రిశక్తిపీఠంలోని మహాలక్ష్మి అమ్మవారిని, సర్కిల్‌పేట శ్రీ కంచికామాక్షిదేవి, శ్రీ భ్రమరాంబదేవి, బుట్టాయిపేట దత్తాశ్రమంలోని అమ్మవారు, బైపాస్ రోడ్డులోని మణిద్వీపేశ్వరి అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. శ్రీ అన్నపూర్ణాదేవిగా రేవతి సెంటరులోని శ్రీ గంగానమ్మతల్లి, నారాయణపురం శివనాగ కనకదుర్గాదేవి దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు.

మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

- ప్రభుత్వ మాజీ విప్ పేర్ని నాని

మచిలీపట్నం, అక్టోబర్ 15: మాట్లాడితే స్వచ్ఛత అనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోవడం గర్హనీయమని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ గడిచిన 12 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినటైనా లేదని విమర్శించారు. కార్మికుల సమ్మెకు సంఘీభావంగా సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కార్మికులు నిర్వహించిన మహాప్రదర్శనలో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. పురపాలక సంఘ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పేర్ని నాని ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. న్యాయపరమైన వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు. 279 జీవో వల్ల కార్మికుల జీవితాలు చిద్రమయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే జీవో నెం. 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, వైసీపీ కౌన్సిలర్లు శీలం బాబ్జి, లంకా సూరిబాబు, మేకల సుబ్బన్న, గూడవల్లి నాగరాజు, అస్ఘర్, ధనికొండ నాగమల్లేశ్వరి, బీసీ సంక్షేమ సంఘ నాయకుడు గడ్డం రాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కొడాలి శర్మ, సీఐటీయు నాయకులు చౌటపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, ఎఐటీయుసీ నాయకులు లింగం ఫిలిప్, కరపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.