కృష్ణ

శోభిల్లుతున్న శ్రీ కొండలమ్మ తల్లి ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు: కోరిన కోర్కెలు తీర్చే కల్పతల్లిగా బాసిల్లుతున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరవ రోజైన సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా నుండే కాకుండా రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. ఆదివారం రాత్రి 8గంటలకు భీమవరంకు చెందిన శ్రీ సౌమ్య అర్కెస్ట్రా వారిచే నిర్వహించిన సినీ సంగీత విభావరి, 9గంటలకు గుడ్లవల్లేరుకు చెందిన కాసాని సుబ్బయ్య బృందం ప్రదర్శించిన బాలనాగమ్మ నాటకం ప్రేక్షకులను కట్టి పడేసింది. 10గంటలకు విజయ నాటక మండలి వారిచే ముచ్చటగా మూడు రత్నములు’ శ్రీ రామాంజనేయ యుద్ధంలోని సన్నివేశాలు రంజింప చేశాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బెల్లంకొండ ఏడుకొండలు, ఆలయ కార్య నిర్వహణాధికారి లీలా కుమార్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమాలను పర్యవేక్షించారు. దుర్గాష్ఠమి సందర్భంగా ఈ నెల 17వతేదీన అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారి సన్నిధిలో వేలాది మంది భక్తులకు అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.