కృష్ణ

ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ-కంకిపాడు రోడ్డులో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం ఉదయం స్థానిక రైలుపేట సమీపంలో ఆక్రమణలో ఉన్న 30వ వార్డు కౌన్సిలర్ కిలిమి వెంకటరెడ్డికి చెందిన రేకులషెడ్డును తొలగించేందుకు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఏ శామ్యూల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, పోలీసులతో వెళ్ళారు. డోజర్‌తో షెడ్డును పడగొట్టేందుకు ప్రయత్నించగా కిలిమి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అయినప్పటికీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది పగలగొట్టేందుకు సిద్ధం కాగా కౌన్సిలర్ కిలిమి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు దీన్ని గమనించి పెట్రోల్ సీసాను లాక్కుని కిందపడేశారు. ఈలోగా కిలిమి కుటుంబ సభ్యులు ఆ సీసాను తీసుకుని అందులో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నం చేశారు. తాము వ్యాపారం చేసే రేకులషెడ్డును పడగొడితే ఆత్మహత్య చేసుకుంటామని కిలిమి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. పోలీసులు మాత్రం పెట్రోల్ పోసుకున్న వారిని అదుపులోకి తీసుకుని నిప్పంటించుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కౌన్సిలర్ కిలిమి ఆక్రమణలతో పాటు సమీపంలోని ఆక్రమణలన్నింటినీ తొలగించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ శామ్యూల్‌తో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం కౌన్సిలర్ కిలిమి మాట్లాడుతూ తాను వైసీపీ కౌన్సిలర్‌గా గెల్చానని, అనుకోని పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళినా తిరిగి సొంత పార్టీలోకి వచ్చానన్నారు. అందువల్లే అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు ఉద్ధేశపూర్వకంగానే ఆక్రమణల పేరుతో తాను వ్యాపారం చేస్తున్న షెడ్డును కూల్చివేశారన్నారు.

స్కూల్లో తాచు పాముల తిష్ట

మోపిదేవి, నవంబర్ 15: మండల పరిధిలోని కోసూరువారిపాలెం ఎలిమెంట్రీ పాఠశాల బాత్‌రూమ్‌ల పక్కనే తాచుపాము కనిపించటంతో పాఠశాల హెచ్‌ఎం హుటాహుటిన పాములు పట్టేవారిని పిలిపించి పుట్టను తవ్వించగా రెండు పాములు, 14 గుడ్లు లభ్యమయ్యాయి. ఈ విషయమై పరిశీలనకు తహశీల్దార్ విమలకుమారి గురువారం విచ్చేశారు. పాఠశాలకు హద్దులు, ప్రహరీ లేకపోవటంతో పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పడిన పుట్టల్లో నాగుపాములు తిరుగాడుతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ పీఎసీఎస్ అధ్యక్షుడు రేపల్లె సీతారామాంజనేయులు గ్రామానికి ఉన్న జెడ్పీ రహదారి బీటీ రోడ్డుపై ఉన్న ఆక్రమణలను, అంతర్గత రహదారుల ఆక్రమణలను తొలగించాలని తహశీల్దార్ జె విమల కుమారికి వినతిపత్రం అందచేశారు.

పిల్లివానిలంక భూములను ఆక్రమించిన దళితులు

తోట్లవల్లూరు, నవంబర్ 15: మండలంలోని చాగంటిపాడు శివారు పిల్లివానిలంక వద్ద కృష్ణానదీపాయల మధ్య భూములను దళితులు గురువారం ఆక్రమించారు. పిల్లివానిలంక మాలలు, చాగంటిపాడు మాదిగలు ఐక్యంగా తరలి వచ్చి ఖాళీగా ఉన్న భూముల్లోకి ప్రవేశించారు. ట్రాక్టర్ తీసుకు వచ్చి ముళ్ళపొదలు తొలగించారు. కొంత భూమిని దుక్కి దున్నించారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌ఐ ప్రసాద్, విఆర్‌ఓలు వీరాస్వామి దళితుల వద్దకు వచ్చి ఇవి పట్టా భూములని, ఆక్రమించేందుకు వీల్లేదని, బయటకు వెళ్ళిపోవాలని కోరినా దళితులు వినలేదు. చాగంటిపాడు ఏరియా ఫీల్డు లేబర్ కో ఆపరేటీవ్ సొసైటీ అధ్యక్షుడు నందేటి కాటమరాజు, కార్యదర్శి పిల్లి కోటేశ్వరరావు, సభ్యులు పిల్లి మాతయ్య, కొక్కిలిగడ్డ యేసుపాదం, నిమ్మకూరి భాస్కరరావు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ ఇది 215, 216 సర్వే నెంబర్లలో 50 ఎకరాల భూమి తాతల కాలం నుంచి మాకిందే ఉందని వాదించారు. తాము శిస్తులు చెల్లించామన్నారు. ఎస్సీ కార్పోరేషన్ నుంచి 15 మోటార్లు మంజూరయ్యాయని, బోర్లు వేయించేందుకు పొలాన్ని బాగుచేస్తుంటే ఇపుడు అవి పట్ట్భాములని, రైతులకు చెందినవని చెప్పటం తగదని కాటమరాజు పేర్కొన్నారు. సంఘంలో 270 మంది సభ్యులమున్నామని, ఇంతకాలం బోర్లులేక పంటలు సాగుచేయలేకపోయామని తెలిపారు. ఆర్‌ఐ, విఆర్‌ఓ మాట్లాడుతూ సర్వేనెంబర్ 216/2ఎ1లో వంద ఎకరాలు రైతులకు చెందిన పట్ట్భాములున్నాయని, వాటిల్లోకి వచ్చి ప్రభుత్వ భూములు ఆక్రమిస్తామంటే కుదరదని తెలిపారు. తహశీల్దార్ రావాలని దళితులు పట్టుబట్టారు. రైతులకు ఈ భూములను అప్పగిస్తే సహించేదిలేదని, అవసరమైతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించైనా భూములను సాధించుకుంటామని దళితులు స్పష్టం చేశారు.