కృష్ణ

సీఎం పర్యటన కుదింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు దివిసీమ పర్యటనపై నీలి నీడలు అలుముకుంటున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సీఎం పర్యటన ఈ సారైనా దివిసీమ పర్యటన ఉంటుందా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అధికారికంగా సీఎం పర్యటన ఇంకా ఖరారు కానప్పటికీ ఈ నెల 19వ తేదీన దివిసీమ వస్తారని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు సీఎం పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు సీఎం పర్యటన దాదాపు ఖరారైనట్టు అధికారులు పేర్కొన్నారు. కానీ నేడు సీఎం పర్యటనలో కొద్దిపాటి మార్పులు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఒక రోజంతా సీఎం దివిసీమలో పర్యటించాల్సి ఉంది. బీజేపీ యేతర పార్టీలన్నింటినీ ఒకే తాటి మీదకు తీసుకు వస్తున్న చంద్రబాబు ఆ రోజు సాయంత్రం మమతా బెనర్జితో భేటీ కానున్నట్టు సమాచారం. ఈ కారణంగా సీఎం పర్యటనను కుదించినట్టు తెలుస్తోంది. తొలిగా మచిలీపట్నం, దివిసీమను అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించిన భవానీపురం-ఉల్లిపాలెం వారధిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ వారధి నిర్మాణం ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి కావటంతో దాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. వారధి ప్రారంభోత్సవంతో పాటు దివిసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా ఆకర్షించేందుకు గాను వారధి సమీపంలో 27 అడుగుల తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా సీఎం చేతుల మీదుగా ఆవిష్కరింప చేయనున్నారు. ఉదయం 9గంటలకు ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా సీఎం చంద్రబాబు వారధి వద్దకు చేరుకుంటారు. వారధి ప్రారంభోత్సవం అనంతరం ఉల్లిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉల్లిపాలెంలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. కానీ గ్రామదర్శినిలో సీఎం పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వారధి ప్రారంభోత్సవం అనంతరం నేరుగా చల్లపల్లి వెళ్లి బహిరంగ సభ ద్వారా సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని అనధికార వర్గాల సమాచారం. చల్లపల్లిలో బహిరంగ సభకు ముందు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘గాంధీ స్మృతి వనం’ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సర్వశక్తులు వడ్డుతున్నారు. సీఎం రాకను పురస్కరించుకుని గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే పలు విడతలు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉపసభాపతి బుద్ధప్రసాద్‌తో కలిసి కలెక్టర్ సమీక్షలు నిర్వహించారు. 1977 నవంబర్ 19న సంభవించిన దివిసీమ ఉప్పెనతో ఈ ప్రాంతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. దీనికి స్మృతిగా నవంబర్ 19వ తేదీన సీఎం గ్రామంలో పర్యటించనున్నారు. 1977 నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు తెలియచేస్తూ వీడియో డాక్యుమెంటేషన్‌ను గ్రామదర్శినిలో ప్రదర్శించనున్నారు.