కృష్ణ

బిల్లుల కోసం సబ్ కాంట్రాక్టర్ల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, మే 12: గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామం వద్ద సోమవారం కాల్వ పనులు నిర్వహిస్తున్న నిర్మాణ సంస్థ తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ సబ్ కాంట్రాక్టర్లు గురువారం కార్యాలయానికి తాళాలు వేసి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గత నవంబర్ నెల నుండి కాల్వ నిర్మాణం నిమిత్తం వంద ట్రాక్టర్లు, 15 డేజర్లు, 20 మిషన్లతో పనులు చేస్తున్నామని, ఈ పనులకు బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థ కార్యాలయం ఎదుట ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు. ఈ విషయంపై పోలవరం ఈఈ మీరంశెట్టిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు.